• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రియాంక పెళ్లి దగ్గరుండి...

ప్రియాంక పెళ్లి దగ్గరుండి చేయిస్తా.. మానస్ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

By - Tupaki Desk
Update: 2021-11-10 13:30 GMT
బిగ్ బాస్ సీజన్ 5 తుదిదశకు వచ్చేస్తోంది. మొత్తం110 రోజుల జర్నీఇప్పటికి తొమ్మిది వారాల వరకు వచ్చింది. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. మానస్ -ప్రియాంక సింగ్ వ్యవహారం రోజురోజుకి ముదురుతోంది. మానస్ తీరు భిన్నంగా ఉంటే.. ప్రియాంక మాత్రం అతడి మీద ప్రేమను అంతకంతకూ పెంచుకుంటోంది. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు మానస్ కు సేవ చేయటం.. అతడికి కోపం వస్తే చల్లార్చే ప్రయత్నం చేయటం.. అతడికి దగ్గరగా ఉండేందుకు ఆమె తపిస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే ఎన్నో భాషల్లో ఎన్నో బిగ్ బాస్ సీజన్లు నడిచాయి. హౌస్ లో ఉన్న వేళ కంటెస్టెంట్లు ఉండే తీరుకు.. ఆ తర్వాత వారి మధ్య ఉండే రిలేషన్ కు ఏ మాత్రం పొంతన ఉండదు. హౌస్ లో అత్యంత సన్నిహితంగా ఉండే వారు.. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తమ రిలేషన్ ను కంటిన్యూ చేసిన వారు చాలా చాలా తక్కువ. ఇక.. పెళ్లి వరకు వెళ్లిన ముచ్చట్లు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు.

ఇక.. ప్రియాంక సింగ్ విషయానికి వస్తే.. దేవుడు తనకు మంచి లైఫ్ ఇచ్చి ఉంటే బాగుండేదని.. అప్పుడు మానస్ తో హ్యాపీగా ఉండేదాన్ని అంటూ అర్థరాత్రి వేళ అతడితో తన బాధను వ్యక్తం చేయటం తెలిసిందే. రోజులు గడుస్తున్న కొద్దీ మానస్ తో అంతకంతకూకనెక్టు అవుతున్న ఆమె పరిస్థితికి అందరూ ఆందోళన చెందే పరిస్థితి. ఇలాంటి వేళ.. హౌస్ బయట ఉన్న మానస్ పేరెంట్స్ ఏమనుకుంటున్నారు? అన్నది ప్రశ్నగా మారింది. తాజాగా మానస్ తల్లి పద్మిని ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం.. అందులో ప్రియాంక గురించి కీలక వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది.

బిగ్ బాస్ హౌస్ అన్నది ఆట అని.. అందులో ఎంతమంది జంటలుగాబయటకు వచ్చారో తెలిసిందేనని చెప్పిన మానస్ తల్లి.. హౌస్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్లీగా ఉంటారని.. ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఎందుకు ఉంటారని ప్రశ్నించారు.హౌస్ లో ఉన్న వారెవరూ మానస్ కు సెట్ కారని తేల్చేశారు.తాను ఎవరి వేలు పెట్టి చూపిస్తే.. మానస్ వారిని పెళ్లి చేసుకుంటారన్న ధీమాను వ్యక్తం చేసిన ఆమె.. ప్రియాంక సింగ్ తన కొడుకును చేసుకుంటానంటే మాత్రంఒప్పుకోనని స్పష్టం చేశారు.

ఆమె అంటే ఇష్టమని.. ఆమెకు తగిన అబ్బాయిని చూపించి దగ్గరుండి పెళ్లి చేసుకుంటాననిచెప్పారు. అలా ప్రియాంకకు తాను సపోర్టు చేస్తానని చెప్పారు. అందుకు ఏదైనా సాయం చేస్తానని చెప్పేసిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి.. బిగ్ బాస్ హౌస్ లో మానస్ - ప్రియాంక సింగ్ జర్నీ ఎలా సాగుతుందో?బయటకు వచ్చాక ఇంకేం అవుతుందో చూడాల్సిందే.
Tags:    
  • BigBoos5telugu 
  • bigg boss 5 priyanka 
  • bigg boss manas 
  • hotstar 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS