'బిచ్చగాడు 2' ఫస్ట్ లుక్...!

Update: 2020-07-24 07:00 GMT
'బిచ్చగాడు' సినిమాతో అటు తమిళం ఇటు తెలుగు ప్రేక్షకులలో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో విజయ్ ఆంటోని. 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బిచ్చగాడు' సినిమా ఎటుంటి అంచనాలు లేకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో విజయ్ ఆంటోని హీరోగా నటించడంతో పాటు నిర్మాతగా సంగీత దర్శకుడిగా కూడా వ్యవహరించాడు. శశి దర్శకత్వంలో తెరకెక్కిన 'బిచ్చగాడు' సినిమాలో అమ్మ సెంటిమెంట్ ని అద్భుతంగా చూపించి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా 'బిచ్చగాడు 2' రాబోతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ ఆంటోనీ 'బిచ్చగాడు' సీక్వెల్ కథ రెడీ అవుతుందని.. నాలుగు నెలల నుంచి స్క్రిప్ప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నానని వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా 'బిచ్చగాడు 2' అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం.

కాగా నేడు మల్టీ టాలెంటెడ్ విజయ్ ఆంటోనీ పుట్టినరోజు. ఈ సందర్భంగా 'బిచ్చగాడు 2' అనౌన్సమెంట్ పోస్టర్ విడుదల చేయడంతో పాటు సాంకేతిక నిపుణులను కూడా ప్రకటించారు. 'బిచ్చగాడు 2'  సినిమాకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రియా కృష్ణస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ ఆంటోని హీరోగా నిర్మాత‌గా వస్తున్న ఈ సినిమా తమిళంలో 'పిచ్చైకారన్ 2' తెలుగులో 'బిచ్చగాడు 2' పేరుతో రూపొందనుంది. 2021లో ఈ సీక్వెల్‌ ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. 'నకిలీ' 'డాక్టర్ సలీమ్' 'బిచ్చ‌గాడు' చిత్రాలతో ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించిన విజ‌య్ ఆంటోని 'బిచ్చగాడు 2' సినిమాతో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.
Tags:    

Similar News