కాజల్ వివాహానికి హాజరవుతున్న యంగ్ హీరో
టాలీవుడ్ లో దశాబ్దం పాటు అగ్ర హీరోయిన్ గా రాణించిన కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. కాజల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లును ఈ నెల 30వ తేదీన వివాహం చేసుకోబోతోంది. ముంబై కి చెందిన గౌతమ్ ఇంటీరియర్ డిజైనర్, ప్రముఖ పారిశ్రామిక వేత్త కూడా. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కాజల్ అత్యంత సన్నిహితులను మాత్రమే వివాహానికి ఆహ్వానిస్తోంది. టాలీవుడ్ లో అతి కొద్దిమందికే కాజల్ ఇన్విటేషన్ పంపింది. యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు ఆహ్వానం అందింది.కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని తన పెళ్లికి పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానిస్తున్నట్టు కాజల్ ఇది వరకే చెప్పింది. ఆమె కేవలం 20 మందినే వేడుకకు ఆహ్వానించిందట.
వివాహానికి హాజరయ్యే విషయానికి సంబంధించి బెల్లంకొండ శ్రీనివాస్ స్పందిస్తూ..
`కాజల్ నా ప్రాణ స్నేహితురాలు. ఆమె మా ఇంట్లో వ్యక్తితో సమానం. కాజల్ కు సరైన పార్ట్నర్ దొరికాడు. అతడు చాలా మంచి వ్యక్తి. కాజల్ వివాహానికి తప్పకుండా హాజరు అవుతా. ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నా. చిత్రీకరణ కు కాస్త బ్రేక్ ఇచ్చి పెళ్లికి వెళతానని బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపాడు. శ్రీనివాస్ -కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో ఇప్పటి వరకు రెండు చిత్రాలు వచ్చాయి. ఒకటి తేజ డైరెక్షన్ చేసిన సీత కాగా, శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో తెరకెక్కిన కవచం మరొకటి. ఈ రెండు సినిమాలు డిజాస్టర్ గానే మిగిలాయి. ఈ రెండు సినిమాల చిత్రీకరణ సమయం నుంచి బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ మంచి స్నేహితులుగా మారారు.