వామ్మో.. బాంబులు పేల్చావా బండ్ల?

Update: 2017-01-26 07:06 GMT
బండ్ల గణేష్.. ఇప్పుడు ఓ స్టార్ ప్రొడ్యూసర్. కమడియన్ గా కెరీర్ ఆరంభించి.. ఇప్పుడు ఓ రేంజ్ ను అందుకున్నాడు. బండ్ల తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలానే సంగతులు చెప్పాడు. తాను ఎన్నో కష్టాల తర్వాత ఈ స్థాయిని అందుకున్నానని చెప్పేందుకు 'ప్లీజ్ ఆంటీ సెక్స్ సినిమా ఏదో ఉంది.. ఇండస్ట్రీలో చెయ్యని పని లేదు సార్ మనం' అంటూ సెక్స్ సినిమాలో హీరోగా చేసిన విషయాన్ని చెప్పేశాడు బండ్ల.

పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంత పిచ్చి.. సినిమా ఇచ్చాడనా.. అని అడిగితే.. 'ఎంతోమంది మగాళ్లుంటే మన నాన్న అంటేనే మనకెందుకు అంత అభిమానం' అంటూ ఎదురు ప్రశ్నించడం ఆశ్చర్యంకరం. 'పవన్ కళ్యాణ్ కు సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాలను దగ్గరుండి సాల్వ్ చేశారట కదా' అనే ప్రశ్నకు 'ఆయనకు ఎవడూ చేయడు.. ఆయనకు దేవుడు కూడా చేయడు. .ఆయనకు ఆయనే సాల్వ్ చేసుకోలగడు.. ఆయన గురించి అసలు మీరేం అనుకుంటున్నారు.. ఆయనకు సంస్కారం ఎక్కువ.. రేర్ పీస్.. గాడ్ మేక్ ఏ రేర్ పీస్.. అలాంటి ఆయన్ను రెండేళ్ల పాటు కలవలేదు' అని చెప్పాడు బండ్ల గణేష్.

కొంతమంది ఆర్టిస్టులకు.. హీరోలకు మధ్య బండ్ల గణేష్ ఫిటింగ్ పెడతాడని కొందరు చెబుతున్నారు అన్నపుడు.. 'నేను ఆ ఇంటర్వ్యూలు చూశాను అవి. ఇండస్ట్రీలో 40 ఏళ్ల నుంచి కొట్టుకు లాడుతున్నారు కదా. వేషాల్లేకపోతే పని జరగదు'.. అలాగే 'నా జీవితంలో నాకు తెలిసి నేను చేసిన తప్పు అదొక్కటే.. సచిన్ జోషీతో సినిమా చేస్తే లాభమొస్తుందా.. బండ్ల గణేష్ అనేవాడు అంత పిచ్చోడా' అన్నాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్.

నయీంతో చెప్పి డబ్బులు వసూలు చేసుకున్నాడట గతా అనే ప్రశ్నకు బండ్ల రియాక్షన్ మామూలుగా లేదు. 'బండ్ల గణేష్ రెండో యాంగిల్ ఏంటో మీకెవరికీ తెలియదు.. మన మీద ఈగ వాలదంతే. ట్రంప్ తో ఫోటో దిగి ఓ వారంలో తెచ్చిమ్మంటారా.. నా స్థాయి నా స్టామినా అది' అని చెప్పిన బండ్ల ఎన్టీఆర్ తో విబేధాలకు కారణం.. బాద్ షా చేసినప్పుడు నాకు కొంత లాస్ వచ్చింది' అన్నాడు.

అలాగే 'ఓ డైరెక్టర్ ఉన్నాడు.. పేరు చెప్పను.. నైట్ అంతా మందు.. డ్రగ్స్ తాగడం.. ఇలాంటోడితో ఎందుకు పని చేశానా అనిపించింది. భగవంతుడు ఇలాంటోళ్లకు లైఫ్ ఇవ్వకూడదని అనిపిస్తుంది' అన్నాడు. 'రవితేజను మోసం చేశాను.. ఓ పొలం అమ్మాను.. ప్రేమగా కొనుక్కున్నాడు ఆ పొలాన్ని' అని చెప్పాడు బండ్ల. 'సినిమా ఫంక్షన్లలో అదే పనిగా హీరోలకు పొగడ్డంలో తప్పేం లేదు.. పొద్దున్న దేవుళ్లను పొగుడుతాం.. దేవుళ్లాంటి హీరోలను పొగిడితే తప్పేంటి' అంటూ నిలదీశాడు బండ్ల.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News