మెగా హీరోలందరిని చుట్టేస్తున్న బండ్ల.. ఒక్క ఛాన్స్‌ కోసమేనా?

Update: 2021-01-02 06:45 GMT
ఇండస్ట్రీలో వ్యక్తి పూజ చేయాల్సిందే. అలా చేస్తేనే అవకాశాలు వస్తాయని చాలా సార్లు నిరూపితం అయ్యింది. బండ్ల గణేష్‌ వంటి ఒక సాదారణ వ్యక్తిని బడా నిర్మాతగా చేసింది ఏంటీ అంటే వ్యక్తి పూజ అనడంలో సందేహం లేదు. ఆ విషయాన్ని స్వయంగా బండ్ల గణేష్‌ కూడా ఒప్పుకుంటాడు. మెగా ఫ్యామిలీతో బండ్ల గణేష్‌ సన్నిహిత సంబంధాలు నెరిపేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. చేతిలో డబ్బు లేకున్నా కూడా మెగా హీరోల డేట్లు ఉంటే సినిమా తీసేయవచ్చు అనేది బండ్లకు బాగా తెలిసిన విషయం. అందుకే  మళ్లీ మెగా హీరోలను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

మెగా హీరో రామ్‌ చరణ్‌ మూవీతో నిర్మాణం నుండి తప్పుకున్న బండ్ల బాబు మళ్లీ మెగా హీరో సినిమాతోనే రీ ఎంట్రీకి సిద్దం అవుతున్నాడు. అందుకోసం న్యూ ఇయర్‌ సందర్బంగా మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు చిరంజీవి.. పవన్‌.. వైష్ణవ్‌ తేజ్.. సాయి ధరమ్‌ తేజ్ లను కలిశాడు. వారికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఒక్క ఛాన్స్ అడిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పవన్‌ ఓకే చెప్పాడని బండ్ల గణేష్‌ పేర్కొన్నాడు. ఇప్పుడు చిరంజీవితో కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. చిరంజీవి కాకున్నా మెగా ఫ్యామిలీలో ఎవరితో సినిమాలు చేసినా కూడా బండ్ల మళ్లీ బిజీ నిర్మాత అయ్యే అవకాశాలు లేకపోలేదు. మరి బండ్ల చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంత వరకు వర్కౌట్‌ అవుతాయో చూడాలి.
Tags:    

Similar News