'వకీల్ సాబ్' పై బండ్ల కామెంట్స్.. 'జాతర షురూ' అయిందంటున్న హరీష్..!

Update: 2021-04-09 11:30 GMT
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ''వకీల్ సాబ్'' మేనియా కొనసాగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత హీరోగా నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం మీడియాలో సోషల్ మీడియాలో 'వకీల్ సాబ్' అనేదే ట్రెండింగ్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో పవన్ రీ ఎంట్రీ మూవీ చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు సినిమా గురించి ట్వీట్లు పెడుతున్నారు.

పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్ ని కాదు భక్తుడిని అని చెప్పుకొనే బండ్ల గణేష్.. ఈ సినిమాపై ట్వీట్ చేసి పవన్ పై మరోసారి తన అభిమానం చాటుకున్నారు. ''మాస్ కా బాప్ వకీల్ సాబ్.. మాటల్లేవ్.. వాదనలు అనవసరం లేదు.. కేవలం జడ్జ్‌ మెంట్ మాత్రమే. బ్లాక్ బస్టర్ వకీల్ సాబ్. జై పవర్ స్టార్'' అంటూ బండ్ల గణేష్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. 'గబ్బర్ సింగ్' డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాపై తన స్పందనను ఒక్క పదంలో చెప్పేశారు. ''జాతర షురూ..'' అని సింగిల్ లైన్ డైలాగ్ తో ట్వీట్ చేసి ఫ్యాన్స్ ని హుషారెత్తించారు.

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్వీట్ చేస్తూ.. ''వకీల్ సాబ్ జడ్జిమెంట్.. పవర్ ఫుల్ బ్లాక్ బస్టర్.. పవన్ కళ్యాణ్ వన్ మాన్ షో ఇది. వేణు శ్రీరామ్ రైటింగ్ అండ్ డైరెక్షన్ సూపర్బ్. థమన్ బీజీఎమ్ మరియు సాంగ్స్ బాగున్నాయి. దిల్ రాజు శిరీష్ లకు బిగ్ కంగ్రాట్స్'' అని పేర్కొన్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - డైరెక్టర్ మెహర్ రమేష్ వంటి వారు 'వకీల్ సాబ్' చిత్ర బృందాన్ని అభినందించారు.

కాగా, 'వకీల్ సాబ్' చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ నిర్మించారు. ఇందులో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. నివేదా థామస్ - అంజలి - అనన్య నాగేళ్ల - ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషించారు.
Tags:    

Similar News