వర్మని తగులుకున్న పవన్ భక్తుడు

Update: 2017-03-26 05:10 GMT
పవన్ కళ్యాణ్ పేరు చెప్పినా.. అసలు మెగా ఫ్యామిలీ అన్నా.. రామ్ గోపాల్ వర్మకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంటుంది. ఆయన సినిమాల్లో మచ్చుకైనా కనిపించడం మానేసిన క్రియేటివిటీ.. మెగా కుటుంబాన్ని విమర్శించడంలో మాత్రం భలే కనిపిస్తూ ఉంటుంది. బహుశా తన ట్యాలెంట్ అంతా ట్వీట్స్ కు వాడేయడంతో.. సినిమాల్లో చూపించడానికి ఏమీ మిగలకపోవచ్చన్నది సెపరేట్ టాక్.

ఇక కాటమరాయుడు విషయంలో వర్మ ఏ రేంజ్ లో బరితెగించాడో తెలిసిందే. మూడు పెళ్ళిళ్లు అంటూ పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ పై కూడా కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. వర్మ వ్యక్తిగతంగా దాడి చేసేసరికి.. పవన్ అపర భక్తుడైన బండ్ల గణేష్ కు కోపం వచ్చేసింది. అదే సోషల్ మీడియా వేదికగా దాడి చేసేశాడు. "దేశానికి నీ వల్ల జరిగిన నష్టం కంటే.. పెద్దగా ఎవరూ చేయలేరులే".. "నువ్వు కనీసం పవన్ చెప్పుల పాటి విలువ చెయ్యవు.. నోరు దగ్గరపెట్టుకో".. " రోడ్డు మీద అరిచే కుక్కా".. ఇలా సాగాయి బండ్ల ట్వీట్లు.

గతంలో కాసింత అటూ ఇటూగా వర్మ ట్వీట్ల వ్యవహారం సాగేది. ఖైదీ నంబర్ 150 ఈవెంట్ లో.. అక్కుపక్షి అంటూ నాగబాబు తిట్టిపోసిన తర్వాత.. వర్మ ఎటాకింగ్ స్థాయి పెరిగింది. ప్రతీసారి మెగా సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా వాటికి నష్టం చేసేందుకు వర్మ ట్రై చేస్తుండడం ఆశ్చర్యకరం. అయితే.. ఒక సినిమా వ్యక్తిగా.. ఓ సినిమా రిలీజ్ టైంలో.. ఆ సినిమాకి నష్టం కలిగించేలా ప్రవర్తించడం సరికాదని.. అలా చేస్తే అతన్ని సినిమా మనిషిగా సినిమా గుర్తించదని.. సినిమా సీనియర్లు అంటున్న మాటలు.. సినీ దర్శకుడు వర్మకు ఈ సమయంలో వినిపించవేమో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News