నా దేవుడు నుంచి ఇంకా పిలుపు రాలేదు!
రెండు వారాల స్వీయనిర్భందంలో ఉండి డాక్టర్ల పర్యవేక్షణతో సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు నిర్మాత కం నటుడు బండ్ల గణేష్. ఒక రకంగా టాలీవుడ్ లో మహమ్మారీని జయించిన తొలి వీరుడయ్యాడు. వైరస్ సోకిందని తెలిసి తొలుత అందరిలాగే కాస్త కంగారు పడ్డా ఆ తర్వాత ఎంతో జాగ్రత్తగా నియమనిబంధనల్ని పాటించి మెడిసిన్ పుచ్చుకుని కోలుకున్నాడట.
తనకు కొవిడ్ సోకిందని తెలియగానే తొలిగా ఫోన్ చేసింది కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అట. ఇప్పటివరకూ తన దేవుడు పవన్ కల్యాణ్ నుంచి తనకు ఫోన్ కాల్ అయినా రాలేదని కలవరపడ్డాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి తనకు కాల్ చేసి చెప్పిన మంచి మాటలు ఎంతో ధైర్యాన్నిచ్చాయని కూడా బండ్ల ఇదివరకూ వెల్లడించిన సంగతి తెలిసిందే. అన్నయ్య ఫోన్ చేసినా ఇంకా తన దేవుడైన తమ్ముడు ఫోన్ చేయలేదని ఆవేదనగానే చెప్పాడు బండ్ల.
వైరస్ ని అలా జయించిన బండ్ల ఇతర విషయాలపైనా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాష్ట్ర విభజన వల్ల ఇరు తెలుగు రాష్ట్రాలు బాగుపడుతున్నాయని అన్నారు. రాష్ట్రం రెండుగా విభజించటం మంచికే. లేకపోతే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచి ఉండేది కాదు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఏపీ ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారని బండ్ల అభిప్రాయపడ్డారు. కేటీఆర్ తో విభేధాల్ని ప్రస్థావిస్తూ తప్పు చేశానని అపరాధ భావంతోనే ఎన్నికల తర్వాత తనను కలవలేదని చెప్పారు. ఇంతకుముందు తన గురించి చెడుగా మాట్లాడటం ద్వారా తాను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. లోకేష్ గత ఎన్నికల్లో ఓడిపోతాడని ఊహించనని కూడా బండ్ల వెల్లడించారు.