• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫేస్ బుక్ లైవ్ లో బాలయ్య...

ఫేస్ బుక్ లైవ్ లో బాలయ్య చేసిన కామెంట్స్ చిరంజీవిని ఉద్దేశించేనా...?

By - Tupaki Desk
Update: 2020-06-10 14:30 GMT
నేడు నటసింహా నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు. ఆయన 60వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా షష్ఠి పూర్తి వేడుకలు ఘనంగా నిర్వహించాలని బాలయ్య ఫ్యాన్స్ భావించినా.. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన పరిస్థితుల వలన కుదరలేదు. అంతేకాకుండా తనను కలవడానికి ఎవరూ రావద్దని బహిరంగ లేఖ ద్వారా ఫ్యాన్స్ కి విజ్ఞప్తి చేశారు బాలయ్య. ''నా హితులు, శ్రేయోభిలాషులు కుటుంబ సభ్యులైన మీ అందరితో కలిసి వేడుక చేసుకొనే అదృష్టానికి అంతరాయం ఏర్పడినందుకు బాధగా ఉంది. ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మీ అందరి ఆరోగ్యం గురించి ఆలోచించడం నా భాధ్యత. మీ క్షేమమే నాకు కొండంత ఆశీర్వాదం'' అంటూ అభిమానులను ఉద్దేశించి లేఖలో పేర్కొన్నారు బాలయ్య. అయితే ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసారు. ఇదిలా ఉండగా ఎప్పుడూ లేనిది బాలయ్య సోషల్ మీడియాలో తన అభిమానులకు అందుబాటులోకి వచ్చారు. సోషల్ మీడియా మాధ్యమం ఫేస్ బుక్ లైవ్ కి వచ్చిన బాలయ్య కొంచెంసేపు తన ఫ్యాన్స్ తో ముచ్చటించారు. ఈ రోజు సాయంత్రం 4:30 నిమిషాలకు లైవ్ లోకి వచ్చిన బాలయ్య వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ అభిమానులు దేవుడిచ్చిన వరమని.. వారి కోసం ఇంకా రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చాడు. బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ మరియు ఇండస్ట్రీ ప్రముఖుల నుండి విషెస్ చెప్పిన వారికి థ్యాంక్స్ చెప్పారు. అంతేకాకుండా ఈసారి అసలు ఎక్సపెక్ట్ చేయని వారు కూడా తన బర్త్ డే విషెస్ చెప్పారని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీ మీటింగ్స్ కి లేదనుకుంటే పిలవకపోయినా ఏమీ కాదని.. కానీ ఇప్పుడు పిలవాల్సిన అవసరం ఉందని.. మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోవాలని కామెంట్స్ చేసారు. అభిమానులు ఎవరిళ్లలో వారే కేకులు కట్ చేస్తూ గిన్నిస్ రికార్డ్ నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న సినిమా టీజర్ కి విశేష ఆదరణ లభిస్తోందని.. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. షూటింగ్ స్టార్ట్ అయిన వెంటనే రెట్టింపు వేగంతో చిత్రీకరణ పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే బాలయ్య ఎక్సపెక్ట్ చేయని విషెస్ వచ్చాయని కామెంట్ చేసింది చిరంజీవి గురించే అని.. ఇండస్ట్రీ మీటింగ్ కి అవసరం కాబట్టి అందర్నీ పిలవాలనే కామెంట్ కూడా చిరు ని ఉద్దేశించే అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
Tags:    
  • Balkrishna 
  • Facebook live 
  • chiranjeevi 

Similar News

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

Copyright @2026

Powered by Blink CMS