వావ్ ఇంట్రస్టింగ్ః జగ్గూభాయ్ తో కలిసి శ్రీకాంత్ ను ఢీకొడుతున్న బాలయ్య..!
బోయపాటి సినిమాల్లో కాస్టింగ్ ఎంత భారీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. హంగూ, ఆర్భాటాలతో ఓ లెవల్లో ఆయన సినిమాలు తెరకెక్కుతుంటాయి. ఇప్పుడు రాబోతున్న బీబీ-3 సినిమాలో కూడా భారీ తారాగణం ఉండబోతోంది.అయితే.. ఇందులో మెయిన్ విలన్ గా శ్రీకాంత్ కనిపించనుండగా.. జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. బోయపాటి ‘లెజెండ్’తోనే విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన జగ్గూభాయ్.. ఈ సినిమాలోకూడా నటిస్తుండడంతో విలన్ క్యారెక్టరే అనుకున్నారు చాలా మంది. కానీ.. అందుతున్న సమాచారం ప్రకారం పక్కా పాజిటివ్ పాత్ర అంట.
అది కూడా బాలయ్యకు రైట్ హ్యాండ్ గా ఉండబోతున్నాడని సమాచారం. అంతేకాదు.. జగ్గూభాయ్ తోనే ఈ సినిమా కథ టర్న్ అవుతుందని కూడా తెలుస్తోంది. మొత్తానికి.. ఈ సినిమాలో జగపతి బాబుతో కలిసి శ్రీకాంత్ ను ఢీకొట్టబోతున్నాడు బాలకృష్ణ.మే 28న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి ఇప్పటి వరకూ టైటిల్ అనౌన్స్ చేయలేదన్న సంగతి తెలిసిందే. అయితే.. శివరాత్రి సందర్భంగా సినిమా టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయబోతున్నారని సమాచారం.