నాన్ స్టాప్ డైలాగ్ తో ఇరగదీసిన బాలయ్య

Update: 2017-01-10 14:18 GMT
సినిమాల్లో ఎలాంటి డైలాగునైనా ఇరగదీసే బాలయ్యకు..స్టేజ్ మీదకు వస్తే చాలు మాట నిదానిస్తది. అప్పుడప్పుడు పాజ్ తీసుకొని మాట్లాడుతుంటారు. మాటకు మాటకు మధ్య గ్యాప్ ఇస్తూ ఆయన మాట్లాడే మాటలు అంత ఆకట్టుకునేలా ఉండవు. వాస్తవానికి విడిగా కానీ.. డబ్బింగ్ చెప్పుకునేటప్పుడు తనదైన ఫ్లోలో మాట్లాడే బాలయ్యకు.. స్టేజ్ మీదకు వస్తే మాత్రం ఇబ్బందిగా ఫీలవుతుంటారు.

అలాంటి బాలయ్య ఈమధ్యన తనలోని లోటుపాట్లను సరిదిద్దుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఈ మధ్యన ఏదైనా సభలో మాట్లాడే సందర్భంలో గతంలో మాదిరి ఇబ్బంది పడకుండా మాట్లాడేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆయన మార్క్ డైలాగ్ ఒకటి బాలయ్య నోటి నుంచి అభిమానుల హర్షాతిరేకాలకు అంతే ఉండదని చెప్పాలి.

నాన్ స్టాప్ గా అన్ని కులాల గుణగణాల్ని.. ఆ కులాల విశిష్ఠతను చెబుతూ.. వాటిని తనలోని వ్యక్తికి అపాదిస్తూ నాన్ స్టాప్ గా చెప్పే భారీ డైలాగు బాలయ్య నోటి నుంచి మాత్రమే విని తీరాలని చెప్పాలి. భారీ డైలాగ్ అయినా.. మధ్యలో ఎలాంటి పాజ్ లేకుండా.. ఒక ఫ్లోలో చెప్పేసే బాలయ్య నోట డైలాగ్ వస్తుంటే.. అభిమానుల కేరింతలు ఓ రేంజ్లోలో ఉంటాయని చెప్పక తప్పదు.

Full View
Tags:    

Similar News