చిరు 150 వర్సెస్ బాలయ్య 100.. అవునా?

Update: 2016-07-25 08:09 GMT
మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా మొదలు పెట్టేశారు. బాలకృష్ణ తన వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణిని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకు పోలిక.. పోటీ పెట్టేస్తూ చాలానే న్యూస్ చక్కర్లు కొట్టేస్తున్నాయి. హీరోయిన్ ని వెతుక్కోవడంలో ఇబ్బందుల నుంచి.. సంక్రాంతి రిలీజ్ వరకూ చాలానే కంపేరిజన్స్ వస్తున్నాయి. రీసెంట్ గా రైటర్ సాయి మాధవ్ బుర్రా.. రెండు సినిమాలకు పని చేయడంతో మరింతగా ఈ పోలికలు పెరిగిపోయాయి.

నిజానికి మెగాస్టార్ చేస్తున్నది మెసేజ్ ఓరియెంటెడ్ పక్కా కమర్షియల్ మూవీ. ఇటు నీటి సమస్యపై మెసేజ్ ఇస్తూనే.. అటు పాటలు-ఫైట్లు అంటూ కమర్షియల్ వేల్యూస్ కి లోటు ఉండని సినిమా. మరి బాలకృష్ణ చేస్తున్న సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి చారిత్రకం. బాలయ్య నుంచి ఇలాంటి ప్రయోగాత్మక చిత్రం వచ్చి ఇరవై ఏళ్లు గడిచింది. 1996లో శ్రీ కృష్ణార్జున విజయం తర్వాత బాలయ్య పౌరాణికాల టైపు జోలికి పోలేదు. అందుకే ఈ మూవీపై అభిమానుల్లో బోలెడంత ఆసక్తి నెలకొంది.

చిరంజీవి 150.. బాలయ్య 100 అనే అంకెలు మినహాయిస్తే.. ఈ రెండు సినిమాలకు ఏ మాత్రం పోలిక ఉండదనేది వాస్తవం. టెక్నికల్ టీమ్ పోలినంత మాత్రాన.. రెండు సినిమాల జోనర్ వేరు కావడంతో.. అసలు పోలిక అనే సమస్యే ఉండదు. రెండు సినిమాలు రెండు రకాలు  కావడంతో.. ప్రేక్షకులు ఎంచక్కా రెండింటినీ ఎంజాయ్ చేసేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Tags:    

Similar News