రిలీజ్ కౌంట్ కా బాప్.. బాహుబలి2

Update: 2017-03-25 16:15 GMT
ఓ సినిమాను భారీగా రిలీజ్ చేయడం అనడానికి.. కొత్త నిర్వచనాలను రచిస్తోంది బాహుబలి2. దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న మూవీ కావడంతో.. బాలీవుడ్ ఖాన్ త్రయాన్ని మించి రిలీజ్ కానుంది బాహుబలి ది కంక్లూజన్. ఇప్పటికే దేశవ్యాప్తంగా 6500  స్క్రీన్స్ లో ఈ చిత్రం రిలీజ్ కానుందని చెప్పేసుకున్నాం.

ఈ భారీ రిలీజ్ ట్రెండ్ యూఎస్ మార్కెట్లో కూడా కంటిన్యూ కానుంది. యూఎస్ జోన్ లో 750 స్క్రీన్లలో ప్రదర్శించేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధమవుతున్నారు. రిలీజ్ సమయానికి ఈ కౌంట్ ఇంకా పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇప్పటివరకూ యూఎస్ లో అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ రికార్డ్ అమీర్ దంగల్ పేరిట ఉంది. ఆ చిత్రం 600 స్క్రీన్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు దాన్ని పెద్ద మార్జిన్ తో ఓవర్ టేక్ చేయనుంది బాహుబలి. మరోవైపు యూఎస్ మార్కెట్లో దంగల్ 12 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించగా.. బాహుబలి2 సేఫ్ జోన్ లోకి వచ్చేందుకే 15 మిలియన్ డాలర్లను రాబట్టాల్సి ఉంటుంది.

ఇక్కడి మార్కెట్ నుంచి బాహుబలి ది బిగినింగ్ 7 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. కానీ బాహుబలి2 మాత్రం అంతకు రెట్టింపు మొత్తాన్ని వసూలు చేయడం పెద్ద కష్టమేమీ కాదనే అంచనాలున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News