భారీ బరువే మోస్తున్నావ్‌ బాహుబలి

Update: 2015-07-09 04:08 GMT
రేపు ఈపాటికి టాలీవుడ్‌ మాత్రమే కాదు యావత్‌ భారతదేశం దద్దరిల్లిపోతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా బాహుబలి సినిమా రిలీజ్‌ అయిపోయి అందరూ సినిమా టాక్‌ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తొలిరోజు వసూళ్ళు, బాక్సాఫీస్‌ రికార్డులు, చరిత్ర తిరగరాత, పార్కర్‌ పెన్‌తో కొత్త అధ్యాయం.. ఇలాంటి మ్యాటర్లన్నీ పక్కనెడితే.. అసలు బాహుబలిపై వసూలు చేయాల్సిన బరువు ఏ రేంజ్‌లో ఉందో తెలుసా?

ఓవర్‌సీస్‌లో తెలుగు దియేట్రికల్‌ రైట్స్‌ను 10 కోట్ల రూపాయల షుమారుకు అమ్మేసి బాహుబలి నిర్మాతలు, ఇక్కడ రెండు రాష్ట్రాల్లో ఏకంగా 81 కోట్లకు ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చారట. ఇప్పటివరకు ఒక తెలుగు సినిమాకు అంత డబ్బులు రావడం ఇదే మొదటసారి. పక్కనున్న తమిళనాడులో లోకల్‌ ప్లస్‌ ఓవర్‌సీస్‌ తమిళ వెర్షన్‌ హక్కులను ఓ 20 కోట్లకు విక్రయించారు. హిందీ వాళ్ల దగ్గరనుండి ఓ 11 కోట్లు, మల్లూ బాయ్స్‌ దగ్గర ఓ 4 కోట్లు వసూలు చేశారు. మొత్తంగా ఓ నూటపాతిక కోట్ల షుమారు ఖర్చుతో డిస్ట్రిబ్యూటర్లందరూ కలసి తమతమ ఏరియాలకు తమకు కావల్సిన బాషలో బాహబలిని దక్కించకున్నారు. అంటే ముందు బాహుబలి టార్గెట్‌ ఈ 125 కోట్లు వసూలు చేయడం. సినిమా హిట్టయినా, బ్లాక్‌బస్టర్‌ అయినా కూడా ఈ 125 వస్తేనే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్‌.

ఇక టివి వాళ్ళు కూడా మాంచి సొమ్ములే ఇచ్చారు. తెలుగు శాటిలైట్‌ రైట్స్‌కు 13 కోట్లు వస్తే, తమిళ్‌, హిందీలో చెరో 10 వచ్చాయని టాక్‌. అవన్నీ సినిమాను టివిలో వేశాక వచ్చే రికవరీ డబ్బులు కాబట్టి వాటి గురించి ఇప్పుడు పెద్దగా వర్రీ అవ్వక్కర్లేదు. ముందుగా ఆ 124 బరువును చక్కగా హ్యాండిల్‌ చేస్తే సినిమాను నమ్ముకొని డబ్బులిచ్చి ఇంతకాలం వెయిట్‌ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు మాంచి రిలీఫ్‌ ఉంటుంది.

Tags:    

Similar News