మెగాస్టార్‌ని గుర్తు చేస్తున్న బాహుబలి

Update: 2015-07-09 11:30 GMT
అభిమానం, ఫాలోయింగ్‌ అనేది మెగాస్టార్‌ చిరంజీవి రాకతోనే పీక్స్‌కి వెళ్లింది. పిచ్చిగా అభిమానించడం, రచ్చ రచ్చ చేయడం కూడా చిరు వల్లే మొదలైంది. బ్రేక్‌ డ్యాన్సులు, క్రాక్‌ డ్యాన్సుల్ని రంగంలోకి దించి స్టారాధిస్టార్‌ ఇమేజ్‌ని తెచ్చుకున్న ఏకైక స్టార్‌ చిరంజీవి.

90లలో అతడి హవా ఓ రేంజులో నడిచింది. ఖైదీ, అత్తకుయముడు-అమ్మాయికి మొగుడు, స్వయంకృషి, ఛాలెంజ్‌, అభిలాష, యముడికి మొగుడు, దొంగ మొగుడు, గ్యాంగ్‌ లీడర్‌, ఘరానా మొగుడు, ఇలా రేంజు పెంచుకుంటూ చిరు కొండంత ఎదిగాడు. ఆ టైమ్‌లో అభిమానం పీక్స్‌కి ఎదిగింది. థియేటర్‌ క్యూలో ఇసుకవేస్తే రాలనంత మంది జనాలు టిక్కెట్ల కోసం ఎదురు చూసేవారు. రోడ్ల పైకి, షాపింగుల పైకి వచ్చేంత క్యూ ఉండేది. కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు జరిగేవి. కాలక్రమేణా ఆ అభిమానం ఏ రేంజుకి ఎదిగిందో అందరికీ తెలిసిన కథే. అయితే చిరు తర్వాత మళ్లీ ఆ రేంజు ఇంకెవరికీ రాలేదు.

కానీ ఇన్నాళ్టికి ఓ స్టార్‌ పుట్టుకొచ్చాడు. స్టార్‌ అనే కంటే స్టార్‌ డైరెక్టర్‌ కం స్టార్‌ హీరో కలయిక వల్ల ఆ స్థాయి వచ్చింది అంటేనే కరెక్ట్‌. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన బాహుబలి ఆ రేంజు క్రేజును తెచ్చింది. థియేటర్‌ క్యూలో నిలబడి కొట్టుకునేంత దారుణమైన పరిస్థితి వచ్చింది. వారం ముందే టిక్కెట్లు దొరకని పరిస్థితి వచ్చిందంటే ఈ సినిమా కోసం జనాలు ఏ రేంజులో వేచి చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

బాహుబలి మానియా టిక్కెటింగ్‌లోనూ కొనసాగుతోంది. బ్లాక్‌ మార్కెట్‌ హవా సాగిస్తోంది. మళ్లీ చాలా కాలానికి చిరు కాలం రిపీటైంది. 90ల నాటి రోజులు రిపీట్‌ అయ్యాయి. ఇంతకాలానికి.. ఇది సాధ్యమైంది.

Tags:    

Similar News