బాహుబలి 2.. లోగో మాత్రం అదిరిందిలే

Update: 2016-10-01 07:41 GMT
ఇకపోతే బాహుబలి 2 ప్రెస్ మీట్లో రాజమౌళి అండ్ టీమ్ ఏమేం చెప్పారో అన్నీ మనం ఇప్పటికే చెప్పుకున్నాం. అక్టోబర్లో రిలీజవ్వబోయే బాహుబలి తాలూకు వివిధ విషయాల గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. అలాగే బాహుబలి టీజర్, ట్రైలర్ అండ్ మూవీ రిలీజ్ డేట్స్ కూడా కన్ఫామ్ అయినట్లు చెప్పేసుకున్నాం. అయితే ఇక చెప్పుకోవాల్సిందే ఒకే ఒక్క కొత్త విషయం గురించి.

''బాహుబలి 2'' ఇంగ్లీష్‌ టైటిల్ ను రిలీజ్ చేశాడు రాజమౌళి. తమ మీటింగ్ జరుగుతున్నంత సేపూ వెనుక ఎల్.ఇ.డి. డిస్ప్లేలో ఇదే ఉంచారు. బాహుబలిః ది కంక్లూజన్ అనేదే సినిమా టైటిల్ అనే విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇప్పుడు ఈ టైటిల్ వెనుక '2' అనే అంకెను చాలా పవర్ ఫుల్ గా చూపించడంతో.. ఈ రెండో భాగం మరింత పెద్దది.. బలమైనది.. అసలు సిసలైనది అనే ఫీలింగ్ వచ్చేస్తోంది.

మొత్తానికి అక్టోబర్ 5న స్పెషల్ గిఫ్ట్ అండ్ 22న ఫస్ట్ లుక్ విడుదల చేసే వరకు.. ఈ లోగో లుక్ తో మనం ఎంజాయ్ చేయాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News