బాహుబలి లొకేషన్ మారుస్తాడా? లేదా?

Update: 2017-02-27 15:35 GMT
అసలు సినిమా ఇండస్ర్టీ అంటేనే చాలా సెంటిమెంట్లు. కాకపోతే హైప్ విపరీతంగా వచ్చిన సినిమాలకు మాత్రం ఎటువంటి సెంటిమెంట్లు ఆయింటుమెంట్లూ అక్కర్లేదు. మరి "బాహుబలి: ది కంక్లూజన్" విషయంలో రాజమౌళి అసలు ఏదైనా సెంటిమెంట్ ఫాలో అవుతాడా లేదా అనేదే ప్రస్తుతం చర్చకు వస్తున్న అంశం.

మ్యాటర్ ఏంటంటే.. బాహబలి-1 ఆడియో రిలీజ్ ను తిరుపతిలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తొలిపార్టు ఆడియో లాంచ్ ను తిరుపతిలో చేశాం కాబట్టి.. 2వ పార్టు ఆడియో రిలీజ్ ను వైజాగ్ లో చేద్దాం అనుకుంటున్నారట నిర్మాతలు. కాని అభిమానులు మాత్రం.. తిరుపతిలో ఆడియో రిలీజ్ చేయడం వలన బాగా కలిసొచ్చి 600 కోట్ల హిట్టు కొట్టాం కాబట్టి.. ఇప్పుడు కూడా అక్కడే చేస్తే బెటర్ అంటూ పట్టుబడుతున్నారట. బాహుబలి నిర్మాతలు మాత్రం.. అలాంటి సెంటిమెంట్స్ లేకుండా ఈసారి బాహుబలి ఆడియో కిక్ ను వేరే ఊరుకు అందించాలని తాపత్రాయ పడుతున్నారు.

మరి లొకేషన్ మారుస్తారా లేదా తెలియాలంటే మాత్రం కాస్త వెయిట్ చేయాల్సిందే. అసలు సినిమాలో కంటెంట్ టాప్ నాచ్ రేంజులో ఉన్నప్పుడు సినిమా ఆడియో ఫీట్ ఎక్కడ చేస్తే ఏంటి చెప్పండి?!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News