#AVATAR 2 పండోరాపై అతి భారీ పోరాట దృశ్యాలు లీక్

Update: 2020-09-25 23:30 GMT
జేమ్స్ కామెరాన్ అవతార్ సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ప్ర‌స్తుతం వ‌రుస‌గా సీక్వెల్స్ తెర‌కెక్కుతున్నాయి. తాజా సీక్వెల్ నుండి క్రొత్త సెట్ ఫోటోలు వెబ్ ని హీటెక్కిస్తున్నాయి. వీటిలో పండోరాపై మానవులు పోరాడుతున్న దృశ్యాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. ప్రశాంతమైన గ్రహం పై అరివీర భ‌యంక‌ర పోరాటానికి సంబంధించిన షూటింగ్ చేసార‌ట‌. 2009 బ్లాక్ బస్టర్ అవ‌తార్ లో పండోరా అద్భుతంగా కనిపించింది. ఇప్పుడు అవతార్ 2 లో అది అత్యంత‌ భారీగా కనిపిస్తుంది.

కోవిడ్ భ‌యాలు ఉన్నా.. ఓవైపు షూటింగ్ చేస్తున్నారు కామెరూన్. న్యూజిలాండ్ ఆధారిత టెక్నాల‌జీతో ప‌ని సాగనుందిట‌. అసలు అవతార్ చిత్రం విడుదలైన తర్వాత, రాబోయే నాలుగు సీక్వెల్స్ మరోసారి చిత్రనిర్మాణంలో విప్లవాత్మకమైనవిగా కనిపిస్తున్నాయి. సీక్వెల్స్ లో పార్ట్ 2 ప్రారంభించడానికి కామెరాన్ చాలా సమయం పట్టింది. అతను సిజిఐ వాడకాన్ని నీటి అడుగున ఫుటేజ్ తో చేయాలనుకున్నాడు. ఇటీవల లీకైన‌ ఆన్-సెట్ ఫోటోలు అదే చూపిస్తున్నాయి. అవతార్ 2 లో కొన్ని ఎగ్జ‌యిట్ చేసే ఉత్తేజకరమైన అండ‌ర్ వాట‌ర్ దృశ్యాలు ఉంటాయని అర్థ‌మైంది.

ఈ నీటి అడుగున దృశ్యాలతో పాటు.. భూమిపై జరగబోయే కొన్ని సీన్స్ గురించి చెప్పే ఫోటోలు బ‌‌య‌ట‌ప‌డ్డాయి. `అవతార్ 2` నిర్మాత జోన్ లాండౌ అధికారిక ఇన్ ‌స్టాగ్రామ్ ఖాతా నుండి వచ్చిన ఒక క్రొత్త ఫోటో పండోరాపై చాలా భయంకరంగా కనిపించే తుపాకీ వార్ ని చూపిస్తుంది. రాబోయే అవతార్ సినిమాలు అభిమానులు ఊహించ‌లేని రేంజులో ఉంటాయ‌ని అవ‌గ‌త‌మ‌వుతోంది. తాజా ఫోటోలో పండోర ఫైర్ ‌ఫైట్ ‌తో పాటు అభిమానులు 2 వ యూనిట్ డైరెక్టర్ గారెట్ వారెన్ ను స్టంట్‌మ్యాన్ స్టీవ్ బ్రౌన్ తదుపరి టేక్ ‌కి ముందు కొన్ని సలహాలు ఇవ్వడం కూడా చూడవచ్చు:

అవతార్ 2 చిత్రం 2022 కి వాయిదా ప‌డింది. దానికి కార‌ణం అవతార్ 2 లో ఎక్కువ భాగం నీటి అడుగున చిత్రీక‌రించే స‌న్నివేశాలేన‌ని తెలిపారు కామెరూన్. ఇదే నిజమైతే మంచిదే. టెర్మినేటర్ ప్రేక్షకులను కదిలించిన తరువాత టెర్మినేటర్ 2 తో ఏలియన్ వ‌ర్సెస్ మెషీన్స్ సినిమాల‌తో క‌ట్టి ప‌డేశారు కామెరూన్. అదే తీరుగా అవ‌తార్ సీక్వెల్స్ తోనూ ఆయ‌న మ్యాజిక్ చేస్తార‌నే అభిమానులు న‌మ్ముతున్నారు.
Tags:    

Similar News