ఆ నిర్మాత ఇచ్చిన పార్టీకి హాజరైన వారంత వణికి పోతున్నారు!
బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలే స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ కరోనా బారిన పడ్డట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమే అన్నట్లుగా స్వయంగా ఆమెనే ఒప్పుకుంది. తాను కరోనా బారిన పడ్డట్లుగా చెప్పుకొచ్చిన కరీనా కపూర్ ఖాన్ తన కుటుంబ సభ్యుల విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
మీడియా వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ఆమె ఇంట్లో మరో ఇద్దరు ముగ్గురు కూడా కరోనా బారిన పడ్డారట. ఇంకా మరి కొందరు కూడా బాలీవుడ్ కు చెందిన వారు కరోనా బారిన పడ్డారు. చాలా మంది వారికి కరోనా అనే విషయాన్ని బయటకు చెప్పడం లేదు. చాలా తక్కువగా లక్షణాలు ఉన్న వారు అసలు ఏమీ తెలియనట్లుగానే ఉంటున్నారు.
బాలీవుడ్ లో ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడంతో ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ మరియు ఆరోగ్య శాఖ వారు రంగంలోకి దిగారు. వారు ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించే పనిలో ఉన్నారు. బాలీవుడ్ కు చెందిన వారు వరుసగా కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో ఎవరికైనా ఒమిక్రాన్ వేరియంట్ ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయంలో వారికి తెలిసిన విషయం ఏంటీ అంటే కొన్ని రోజుల ముందు బాలీవుడ్ కు చెందిన స్టార్ నిర్మాత కరణ్ జోహార్ పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీ లో బాలీవుడ్ కు చెందిన వారు చాలా మంది పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఈ వైరస్ ఎటాక్ అయ్యి ఉంటుందని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా నిబంధనలు అమలులో ఉన్న సమయంలో పార్టీలు జరగడం విమర్శలకు దారి తీసింది.
పార్టీ ఇచ్చిన నిర్మాతను ఇప్పటికే ప్రశ్నించడంతో పాటు ఆయనపై కేసు నమోదు చేసినట్లుగా సమాచారం అందుతోంది. మరో వైపు పార్టీ ఇచ్చిన ఇంటిని కూడా ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు సీజన్ చేశారట. ప్రస్తుతం బాలీవుడ్ లోని పలువురు ప్రముఖులను అధికారులు పరీక్షిస్తున్నారు.
పార్టీకి హాజరు అయిన వారిని మరియు వారి కుటుంబ సభ్యులను పూర్తిగా ఇంటికే పరిమితం అవ్వాలని సూచించారు. పార్టీకి హాజరు అయిన వారి ద్వారా ఇండస్ట్రీలో చాలా మందికి ఈ వైరస్ సోకి ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతు థర్డ్ వేవ్ భయపెడుతున్న సమయంలో బాలీవుడ్ వర్గాల వారి పార్టీలు చేసుకోవడం ఏంటీ అంటూ కొందరు విమర్శిస్తున్నారు.
మొత్తానికి కరణ్ జోహార్ పార్టీకి హాజరు అయిన వారు.. ఆ హాజరు అయిన వారిని కలిసిన వారు కరోనాతో వణికి పోతున్నారు. వారు రెండు వారాల వరకు పూర్తిగా ముంబయి మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో ఉండాల్సిందేనట. రాబోయే రెండు వారాల్లో ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో అనే ఆందోళన ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది.