‘జగదేకవీరుడు అతిలోక సుందరి’లో చిరంజీవి పారితోషికం ఎంతంటే?

Update: 2020-05-12 00:30 GMT
మెగా స్టార్ చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మైలురాయిగా నిలిచిన చిత్రం ‘జగదేక వీరుడు -అతిలోక సుందరి’. ఆ చిత్రంతో చిరంజీవి ఓ మెట్టు టాలీవుడ్ లో ఎక్కాడనే చెప్పవచ్చు. సరిగ్గా ఆ చిత్రం వచ్చి 30 ఏళ్లు అవుతోంది. దీంతో హీరో నాని నుంచి మెగా అభిమానుల వరకు చిత్ర విశేషాలను కథలు కథలుగా చెబుతున్నారు.

నిర్మాత అశ్వినీదత్ తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. ఈ సినిమాలో ఎవర్ గ్రీన్ గా జోడీగా అలరించిన చిరంజీవి, శ్రీదేవిల పారితోషికం ఎంతో సీక్రెట్ చెప్పారు. ఇక సినిమా ద్వారా తనకు ఎంత లాభం వచ్చింది కూడా వెల్లడించారు.

‘జగదేక వీరుడు -అతిలోక సుందరి’ సినిమాకు గాను చిరంజీవికి అప్పుడే తాను రూ.35 లక్షల పారితోషకం ఇచ్చినట్లు నిర్మాత అశ్వినీదత్ వెల్లడించారు. ఇక అప్పట్లో స్టార్ హీరోలతో సమానంగా ఇమేజ్ ఉన్న శ్రీదేవికి కూడా ఏకంగా రూ.25 లక్షల పారితోషకం ఇచ్చినట్లు వెల్లడించారు. అందరి పారితోషకాలు, ఖర్చులు పోను తనకు ఈ సినిమాకు గాను రూ.35 లక్షలు మిగిలిందని నిర్మాత అశ్వినీదత్ వెల్లడించారు..

అయితే ఈ మొత్తం ఇప్పుడు చిన్నమొత్తం కానీ.. ఆ సమయంలో కొన్ని కోట్ల విలువైనది. ఎందుకంటే అప్పట్లో రూ.18 లక్షలు సినిమాకు మిగిలితే సూపర్ హిట్ కింద లెక్క. ఈ లెక్కన డబుల్ ఆదాయం వచ్చిన ఈ చిత్రం బంపర్ బ్లాక్ బస్టర్ అన్నట్టే. ఇప్పటితో పోలిస్తే వందల కోట్లపైనే లాభం వచ్చినట్టు..

ఆ సమయంలో ఈ సినిమా ఏకంగా రూ.7 కోట్ల షేర్ వసూలు చేసిందట.. తన దగ్గరున్న మొత్తం డబ్బు పెట్టి తీసిన ఈ చిత్రం తనను నిలబెట్టిందని.. అప్పుడు బాల్కనీ టికెట్ రేట్ రూ.6 రూపాయలని అశ్వినీదత్ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు.
Tags:    

Similar News