సెట్లో గాయాలైనా `ఎనిమీ` ఆర్య వ‌దిలిపెట్ట‌‌డే!

Update: 2020-12-29 05:16 GMT
బాలా ద‌ర్శ‌క‌త్వంలో `వాడు - వీడు` లాంటి క్లాసిక్ చిత్రంలో న‌టించారు విశాల్-ఆర్య స్నేహితులు. ఆ త‌ర్వాత చాలా కాలానికి తిరిగి ఈ గ్రేట్ ఫ్రెండ్స్ క‌లిసి న‌టిస్తున్నారు అన‌గానే అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది.
 
అభిమానులలో తక్షణ ఉత్సాహాన్ని ఉత్సుకతను పెంచిన చిత్రంగా ఎనిమీ పాపుల‌రైంది. విశాల్ - ఆర్య జోడీ మ్యాజిక్ మ‌రోసారి వెండితెర‌పై స్పెష‌ల్ ట్రీట్ ఇస్తుంద‌న్న అంచ‌నా ఏర్ప‌డింది. ఈ చిత్రానికి అరింబ నంబి- ఇరు ముగన్ - నోటా లాంటి చిత్రాల్ని తెర‌కెక్కించిన‌ ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ క‌థాంశంతో రూపొందుతోంది. విశాల్ హీరోగా క‌నిపిస్తే.. ఆర్య విరోధి(విల‌న్‌)గా క‌నిపిస్తాడు. గత నెలలో హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ముఖ్యమైన షెడ్యూల్ ని పూర్తి చేయ‌గా.. ప్ర‌స్తుతం చెన్నై శివార్లలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఆన్ లొకేష‌న్ ఆర్యకు సోమవారం తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

ఆర్య - విశాల్ ఇద్దరూ యాక్షన్ సన్నివేశం కోసం బాడీ డబుల్ లేకుండా న‌టిస్తున్నారు. ఆర్య‌కు ప్ర‌మాదం వాటిల్లింది. గాయపడిన తరువాత ఆసుపత్రిలో చేరారు. ఆర్యకు అవసరమైన చికిత్స అందింది. అతనికి గాయం ఉన్నప్పటికీ షూట్ పూర్తి చేయడానికి మరోసారి ఎనిమీ సెట్స్ ‌లో చేరాడు. ఫిజిక‌ల్ ఫిట్నెస్ ఉన్న హీరోగా పేరుగాంచిన ఆర్య అన్నివేళ‌లా ఇలానే పూర్తిస్థాయిలో తన నిబద్ధతను చూపించాడు. పా. రంజిత్  `సర్పట్టా పరంబరై` కోసం తన శారీరక పరివర్తన ఇటీవల స్పష్టమైంది.

`ఎనిమీ` విశాల్ కి 30 వ సినిమా కాగా.. ఆర్యకు 32 వ చిత్రం. టైటిల్ లుక్ పోస్టర్ కొంతకాలం క్రితం ఆవిష్కరించారు. అభిమానుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆర్య‌.. విశాల్ కెరీర్ లో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాయ‌మ‌న్న అంచ‌నా అభిమానుల్లో ఏర్ప‌డింది.

ఇప్పటి వరకు ఎనిమీలో ఆర్య లుక్ కోసం అధికారిక పోస్టర్ ఏదీ ఆవిష్కరించలేదు. విశాల్ ఫస్ట్ లుక్ కొద్ది రోజుల క్రితం విడుదలైంది. ఈ చిత్రంలో విశాల్ ఆర్యతో పాటు టిక్ టోక్ ఫేమ్ మృణాళిని రవి న‌టిస్తున్నారు. ఐదుసార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఎనిమీలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఎనిమీ మినీ స్టూడియోస్ కి తొమ్మిదవ వెంచర్ కాగా.. వరుసగా నాల్గవ తమిళ వెంచర్. ఎస్.ఎస్.తమన్ ఎనిమీకి సంగీతం ఇస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్డీ రాజశేకర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Tags:    

Similar News