• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చెల్లిని ఓదార్చిన అర్జున్...

చెల్లిని ఓదార్చిన అర్జున్ క‌పూర్

By - Tupaki Desk
Update: 2018-02-26 05:36 GMT
కోట్లాది మంది సినీ అభిమానుల ఆరాధ్యదేవత అతిలోక సుంద‌రి హఠాన్మరణం చెందారు. ఆమె మృతి వార్తతో యావత్ భారతదేశం శ్రీదేవి ఇక తిరిగి రాలేద‌న్న స‌త్యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు.

 ఓవైపు శ్రీదేవి మ‌ర‌ణం బాత్రూంలో అచేత‌నావ‌స్థ‌లో ప‌డి ఉండ‌గా భ‌ర్త బోనీ క‌పూర్ ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించి కాపాడుకునే ప్ర‌యత్నం చేశార‌ని - కానీ ఆ ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌లమై శ్రీదేవి మ‌రణించింద‌ని కొంత‌మంది స‌న్నిహితులు చెబుతున్నమాట‌. కానీ అతిలోక సుంద‌రి మ‌ర‌ణంపై  అనేక సందేహాల‌కు తావిచ్చేలా అర‌బ్ ఖ‌లీజ్ టైమ్స్ వ‌రుస క‌థ‌నాల్ని ప్ర‌సారం చేస్తుంది. దీంతో శ్రీదేవి మ‌ర‌ణం ఓ మిస్టరీగా మారుతుందేమోన‌న్న అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు ఆమె అభిమానులు.
 
ఈ నేప‌థ్యంలో బోనీ కపూర్ మొదటి భార్య మోనా షౌరేల కుమారుడు - బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్  త‌న సవతి తల్లి శ్రీదేవి గురించి ఏం చెబుతాడా అని ఎదురు చూస్తుంది. గ‌తంలో ప‌లుమార్లు మీడియాతో  అర్జున్ క‌పూర్ శ్రీదేవికి వ్య‌తిరేకంగా మాట్లాడిన సంద‌ర్భాలున్నాయి.  తన తండ్రిని శ్రీదేవి హైజాక్ చేసిందని అర్జున్ అభిప్రాయపడుతూ వుంటారు. శ్రీదేవికి - అర్జున్‌ కి మధ్య సయోధ్య కుదర్చడానికి గతంలో బోనీ కపూర్ ప్రయత్నించి అది కుదరకపోవడంతో చేతులెత్తేశాడు. తాజాగా అర్జున్ కపూర్ మరోసారి శ్రీదేవి మీద తన కోపాన్ని బహిర్గతం చేశాడు. శ్రీదేవి ఎప్పటికీ మా నాన్న బోనీ భార్యే - అంతకుమించి మా మధ్య బంధం లేదు.. ఆమె నాకు తల్లి కాదు అంటూ అర్జున్ మరోసారి చెప్పాడు. శ్రీదేవితో తన అనుబంధం ఎప్పటికీ ఉండదని ప‌లుమార్లు స్పష్టం చేశాడు

కేవలం శ్రీదేవితోనే కాదు…ఆమె కూతుళ్లు అనగా తన చెల్లెళ్లు జాన్వీ - ఖుషీ లతో తనకు అస్సలు పరిచయమే లేదన్నట్టుగా మాట్లాడాడు అర్జున్. తాము ఎప్పుడూ కలవం అని - కలిసి మాట్లాడకోవడం - సరదాగా గడపడం అస్సలు ఉండదని.. అర్జున్ కుండబద్ధలు కొట్టడం విశేషం.

ఈ నేప‌థ్యంలో శ్రీదేవి మ‌రణంపై అర్జున్ ఎలా రియాక్ట్ అవుతాడోన‌ని బాలీవుడ్ మీడియా  ప్ర‌శ్నించే ప్ర‌య‌త్నం చేసింది. శ్రీదేవి మరణం వార్త తెలుసుకున్న అర్జున్ కపూర్ తన కొత్త సినిమా షూటింగ్‌ ను క్యాన్సిల్ చేసుకుని ముంబై చేరుకున్నాడు.

 పెళ్లి కోసం శ్రీదేవి - బోనీకపూర్ - చిన్న కూతురు ఖుషీ దుబాయ్ వెళ్లారు. అక్కడ శ్రీదేవి మృతి చెందారు. జాన్వి దఢక్ సినిమా షూటింగ్‌ కోసం ముంబైలోనే ఉన్నారు. త‌న స‌వ‌తి త‌ల్లి మ‌రణవార్త‌తో ముంబైకి వ‌చ్చిన అర్జున్ త‌న చెల్లి జాన్వి క‌పూర్ ను ఓదార్చాడు. కొద్ది సేప‌టి త‌రువాత శ్రీదేవి మ‌ర‌ణంపై అర్జున్ ఏంమాట్లాడ‌తారోన‌ని ఎదురు చూసినా సైలెంట్ గా వెళ్లిపోయాడు.

అయితే అర్జున్ తీరును బాలీవుడ్ మీడియా ప్ర‌శంసిస్తుంది. గ‌తంలో శ్రీదేవికి వ్య‌తిరేకంగా మాట్లాడిన చెల్లెళ్ల‌ను ఓదార్చ‌డం గొప్ప విష‌య‌మ‌ని - మ‌న‌సులో ఎన్ని విద్వేషాలు ఉన్నా అవేం ప‌ట్టించుకోకుండా జాన్విని ఓదార్చి అస‌లైన హీరో అనిపించుకున్నాడ‌ని అంటుంది.

Full View

Tags:    
  • Arjun Kapoor 
  • Jhanvi Kapoor 
  • Telugu NEws 

Similar News

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

Copyright @2026

Powered by Blink CMS