మాస్ మహారాజా పక్కన చిందులేస్తున్న ఆర్జీవీ అప్సర రాణి...!

Update: 2020-10-16 11:10 GMT
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ''క్రాక్'' సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే హైదరాబాద్‌ లో తిరిగి ప్రారంభమైన ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ లో శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ మాస్ ఐటెమ్‌ సాంగ్‌ ను షూట్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలియచేసింది. ఈ మాస్ నంబర్ లో రవితేజ పక్కన అప్సరా రాణి కాలుకదుపుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కంపోజ్ చేసిన ఈ మాస్ ఐటెం నెంబర్ కు జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. జీకే విష్ణు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. తాజాగా రవితేజ - అప్సరా మధ్య షూట్ చేస్తున్న ఈ సాంగ్‌ కు సంబంధించిన ఓ ఫోటోని డైరెక్టర్ గోపీచంద్ మలినేని ట్విట్టర్ లో షేర్ చేశారు.

కాగా, ఆర్జీవీ తీసిన 'థ్రిల్లర్' మరియు 'లెస్బియన్' చిత్రాల్లో అప్సరా రాణి ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'క్రాక్' లో ఐటెం సాంగ్ హిట్ అయితే అప్సర రాణి కెరీర్ భారీ టర్న్ తీసుకోవడం ఖాయమని చెప్పవచ్చు. 'డాన్‌ శీను' 'బలుపు' వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత రవితేజ - గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా రుపందుతున్న ఈ చిత్రంలో రవితేజ పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ గా కనిపించనున్నాడు. రవితేజ సరసన శ్రుతి హాసన్‌ హీరోయిన్‌ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ - సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'క్రాక్' ఫస్ట్ లుక్ మరియు టీజర్ విశేష స్పందన తెచ్చుకుంది. సరస్వతి ఫిలిమ్‌ డివిజన్‌ బ్యానర్‌ పై ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
Tags:    

Similar News