అనుష్క వద్దకు మరో దర్శకుడు

Update: 2021-05-13 14:30 GMT
టాలీవుడ్ ప్రేక్షకులు అనుష్క సినిమాల కోసం కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది అనుష్క నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా నిరాశ పర్చినా కూడా ఆమె సినిమా ల కోసం ఇంకా అభిమానులు ఎదురు చూస్తున్నారు. అనుష్క హీరోయిన్ గా ఈ ఏడాది ఒక సినిమా రూపొందాల్సి ఉంది కానీ కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది.

అతి త్వరలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. అనుష్క హీరోయిన్ గా ఇప్పటికే ఒక సినిమా ఖరారు అయ్యిందని వార్తలు వచ్చాయి. ఆ సినిమా విషయమై క్లారిటీ రాలేదు. ఇదే సమయంలో ఆమెతో సినిమాలు చేసేందుకు గాని పలువురు దర్శకులు ఆసక్తిగా ఉన్నారు. ఇటీవల ఓ క్రేజీ డైరెక్టర్ అనుష్కను కలిశాడట. ఒక వెబ్ సిరీస్ కోసం కథను వినిపించాడని సమాచారం అందుతోంది.

అనుష్క ఆ దర్శకుడికి దాదాపుగా ఒకే చెప్పింది. కానీ ఇప్పట్లో షూటింగ్ కు హాజరు అయ్యేది లేదని చెప్పిందట. వెబ్ సిరీస్ లపై ఆసక్తి ఉన్న అనుష్క త్వరలోనే ఆ విషయమై మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక యూవీ బ్యానర్ లో సినిమాను త్వరలో పట్టాలెక్కించే అవకాశం ఉంది అంటూ సమాచారం అందుతోంది. మొత్తానికి అనుష్క నటించాలే కానీ వరుసగా ఆఫర్లు వస్తాయి.
Tags:    

Similar News