స్వీటీ షాకిచ్చే ప్రకటన ఏమై ఉంటుంది?
స్వీటీ అనుష్క శెట్టి ఇటీవల కెరీర్ పరంగా నెమ్మదించిన సంగతి తెలిసిందే. అందుకు రకరకాల కారణాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. అనుష్క శెట్టి నటించిన నిశ్శబ్ధం అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. అయితే జనాదరణ పరంగా ఆశించిన ఫలితం దక్కలేదు. ఈ చిత్రం ఫలితంతో నిరాశ చెందకుండా.. అనుష్క గత కొన్ని నెలలుగా రకరకాల స్క్రిప్ట్ లను వింటున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. అనుష్క రెండు స్క్రిప్ట్ లను ఖరారు చేశారట. జనవరిలో వాటికి సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నారు. కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.
అన్నట్టు స్వీటీ ఇంత గ్యాప్ తీసుకున్నారు కాబట్టి పెళ్లి గురించి ఏమైనా ప్రకటిస్తారా? అంటూ అభిమానులు ఆసక్తిగా ఆరాలు తీసారు. కానీ తనకు ఇప్పట్లో ఆ ఆలోచన లేదు గనుకే కెరీర్ పరంగా బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.