టీజ‌ర్ టాక్: చ‌ంద్రునికి మోడ్ర‌న్ ‌క‌న్యకు లింకు?

Update: 2020-06-11 06:00 GMT
పెద్ద‌తెర .. బుల్లితెర స‌హా ఓటీటీ క‌థ‌లు మారుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఓటీటీపై సృజ‌నాత్మ‌క‌త‌ను ప‌రిమిత బ‌డ్జెట్ల‌తోనే ఆవిష్క‌రించుకునే వీలుండ‌డంతో ఈ రంగంపై ప్ర‌తి ఒక్క‌రూ ఆస‌క్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ అందాల క‌థానాయిక .. నిర్మాత అనుష్క శ‌ర్మ ప్ర‌స్తుతం ఓటీటీపై ప్ర‌యోగానికి శ్రీ‌కారం చుట్టారు.

తొలి ప్ర‌య‌త్నంగా బుల్ బుల్ అనే వెబ్ సిరీస్ ని నిర్మించారు. తాజాగా బుల్ బుల్ టీజర్ విడుదలైంది. టీజ‌ర్ ఆద్యంతం సంథింగ్ ఏదో స్పెష‌ల్ అనేంత మ్యాట‌ర్ క‌నిపిస్తోంది. ఒక అంద‌మైన మోడ్ర‌న్ క‌న్య‌క ఎరుపెక్కిన చంద్రుని వైపు ఎగురు కుంటూ వెళుతోంది. చంద్రునికి స‌మీపంలోనే ఎంతో ప్ర‌కృతి చెట్లు ఆద్యంతం ఆస‌క్తిని పెంచాయి. అయితే ఈ టీజ‌ర్ సస్పెన్స్.. న్యాచుర‌ల్ థ్రిల్ల‌ర్ కి సింబాలిక్ అనే చెప్పాలి.

ఏదో కొత్త ఇమాజినేష‌న్ తో క్రియేటివ్ గా ట్రై చేస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఫ్యామిలీ మ్యాన్ - ఎస్.వో.పీ (పార్ల‌మెంట్ ఎటాక్స్)  లాంటి వెబ్ సిరీస్ ల‌తో పోలిస్తే ఇది పూర్తిగా డిఫ‌రెంట్. ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ ఇదని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అనుష్క శ‌ర్మ స్వ‌యంగా తన సోద‌రుడు క‌ర్ణేశ్ తో క‌లిసి నిర్మిస్తున్నారు. జూన్ 24న నెట్‌ఫ్లిక్స్ లో విడుద‌ల కానుంది. తండ్రి ఆర్మీ అధికారి అయినా అనుష్క శ‌ర్మ మోడ‌లింగ్ గ్లామ‌ర్ రంగంలో రాణించిన తీరు అస‌మానం. ఇత‌ర నాయిక‌ల‌తో పోలిస్తే బిజినెస్ ఉమెన్ గా ఎంట‌ర్ ప్రెన్యూర్ క్వాలిటీస్ తో భారీ ఆదాయ ఆర్జ‌న చేస్తోంది. టీమిండియా ట్యాలెంటెడ్ కెప్టెన్ విరాట్ కోహ్లీని వెడ్ లాక్ చేసి ఔరా! అనిపించిన గ్రేట్ ట్యాలెంట్ అనుష్క శ‌ర్మ సొంతం.
Full View
Tags:    

Similar News