అనుష్క.. సైజ్‌ గురించి స్లిప్పవ్వలేదు

Update: 2015-11-25 17:30 GMT
ఆ మధ్యన ఒక చిన్న డిస్కషన్‌ లో మీకు సైజ్‌ జీరో అంటే ఇష్టమా అంటే సెక్సీ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్ సింగ్‌ ఓ రెండు మూడు విషయాలు చెప్పింది. అది విన్న జనాలందరూ షాకైపోయారు. ఇప్పుడు ఇదే విషయంలో సీనియర్‌ బ్యూటి అనుష్క మాత్రం ఎటువంటి మిస్టేక్‌ చేయలేదు.

ఏకంగా 'సైజ్‌ జీరో' అనే పేరుతో ఒక సినిమానే చేస్తున్న అనుష్కను.. మీకు సైజ్‌ జీరో అంటే ఇష్టమా అని అడగ్గా.. ''జీరో సైజ్‌ ని అస్సలు ఇష్టపడను. నా ఎత్తుకి తగ్గ బరువు ఉండాలనుకుంటాను. ఆరోగ్యం గురించి కేర్ తీసుకుంటా'' అంటూ సెలవిచ్చింది. అయితే ఇదే విషయాన్ని గతంలో రకుల్‌ ప్రీత్‌ ను అడిగితే.. అబ్బే నాకు సైజ్‌ జీరో అంటే ఇష్టం లేదు.. మనలో మన మాటా నాది సైజ్‌ 6 అనేసింది. అంటే నా కొలతలు 31-24-34 అంటూ స్వయంగా తనకు తానే చెప్పుకుందనమాట. పొరపాటను అనుష్క కూడా అలా కొలతల గురించి రివీల్‌ చేసుంటేనా.. వార్నాయనో రచ్చ రంబోలా అయిపోయేదే.

ఇప్పటికే అనుష్క అందాల గురించి ఆలి చేసిన తొడల కామెంట్లు ఎంతటి కార్చిచ్చు రేపాయో తెలిసిందే. అయితే ఇప్పుడు స్వయంగా సైజ్‌ గురించి డిస్కస్‌ చేసుంటే సీన్‌ భీభత్సంగా ఉండేది. అంతేలే.. సీనియార్టి వలన ఏ మాట్లాడాలి అనే మెట్యూరిటీ ఆటోమ్యాటిక్‌ గా వస్తుంది.
Tags:    

Similar News