నా గొంతుతో డబ్బింగ్ కష్టమే
టాలీవుడ్ బ్యూటీ అయినా స్వీటీగా జనాలు పిలుచుకునే సుందరి అనుష్క శెట్టి. 2005లో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ భామ.. ఇప్పటికీ తన పాత్రలకు డబ్బింగ్ చెప్పుకోవడం లేదు. నిన్న కాక మొన్నొచ్చిన హీరోయిన్లు కూడా తెలుగు పలుకులతో ఆకట్టుకుంటున్నా.. అనుష్క మాత్రం ఇప్పటివరకూ ప్రయత్నించిన పాపాన పోలేదు.
తనకు తెలుగు మాట్లాడడం వచ్చినా.. ఉద్దేశ్యపూర్వకంగానే డబ్బింగ్ చెప్పడం లేదని అంటోంది స్వీటీ. తను చేస్తున్న పాత్రలకు తన గొంతు అసలు సెట్ కాదన్నది ఈమె వాదన. అప్పట్లో అరుంధతి నుంచి.. గత వారం వచ్చిన భాగమతి వరకూ.. అనేక సినిమాల్లో సీరియస్ తరహాగా సాగే పాత్రలను పోషించానన్న స్వీటీ.. తన గొంతు మాత్రం ఈ పాత్రలకు ఏ మాత్రం అనువుగా ఉండదని అంటోంది. తన స్వరం స్వీట్ గా ఉంటుందని.. అంటే చిన్నపిల్లలు మాదిరి మాడ్యులేషన్ గా అనిపిస్తుందని చెబుతోంది అనుష్క. భాగమతి లాంటి క్యారెక్టర్స్ కు అలాంటి వాయిస్ తో డబ్బింగ్ చెప్పడం సరికాదని కూడా సెలవిచ్చింది.
ఏతావాతా ఈమె తేల్చింది ఏంటంటే.. తను డబ్బింగ్ చెప్పే అవకాశాలు తక్కువే అని. ఓ రకంగా చూస్తే ఆమె చెబుతున్నది కూడా వాస్తవమే అని ఒప్పుకోవాలి. చిన్న పిల్ల గొంతేసుకుని.. భాగమతిరా ఇది.. అంటూ డైలాగులు చెబితే అంతగా పండవు కదా.