ఎన్ని ఉన్నా నాకు పూరీనే ఇష్టం: అనుష్క

Update: 2020-03-24 00:30 GMT
అనుష్క. ఈ పేరు వింటే తెలుగు కుర్రకారు మనసులో తెలియని ఆనందం ఉత్సాహం కన్పిస్తాయి. ఎందుకంటే అనుష్క అభిమానుల కలల రాణి. ఇప్పుడే కాదు ఎప్పటికైనా అనుష్కను బీట్ చేసేవాళ్ళు ఈ మధ్య కాలంలో అయితే రాకపోవచ్చు. సౌత్ సినీ ఇండస్ట్రీలో అనుష్కతో పనిచేయని హీరోలు లేరు - దర్శకులు లేరు. టాప్ డైరెక్టర్లు కూడా అనుష్కతో పనిచేయడానికి ఉబలాటపడుతూ ఉంటారు. అలాంటి అనుష్కను మొదటి సినిమా నుండి పై స్థాయికి తీసుకొచ్చిన దర్శకులు ఎందరో ఉన్నారు. అయితే అమ్మడిని మాత్రం నీ ఫేవరేట్ డైరెక్టర్ ఎవరు అని అడిగితే.. ఏమి ఆలోచించకుండా పూరిజగన్నాథ్ అని చెప్పేసింది.

అదేంటి మీ కెరీర్ లో పూరీతో చేసింది ఒకే సినిమా కదా.. చాలా మంది డైరెక్టర్లతో ఎన్నో సినిమాలు చేసారు కదా. ఎందుకు ఆయన మీ ఫేవరెట్?  అంటే.. నేను చాలామంది గొప్ప దర్శకులతో పనిచేసాను. కానీ నాలో ఒక నటి ఉందని, నేను నటిగా పనికొస్తానని నమ్మి  మొదటి అవకాశం ఇచ్చారు. నేను ఈరోజు సినీ ఇండస్ట్రీలో ఒక నటిగా నిలబడ్డానంటే దానికి కారణం మాత్రం పూరీ సారే.. అంటూ స్వీట్ గా జవాబిచ్చింది స్వీటీ. సూపర్ సినిమా ఫలితాన్ని పక్కన పెడితే నాలో నటికి నమ్మకాన్ని కల్పించిన ఘనత ఆయనదే అంటూ సెలవిచ్చింది. కొంచెం ఆశ్చర్యం అనిపించినా.. హీరోయిన్లకు కూడా పూరీ లాంటి మాస్ డైరెక్టర్లు ఫేవరేట్ గా ఉండటం సంతోషించాల్సిన విషయమే..! పూరీ సార్ నీకు ఫేవరేట్ అయితే మాకు ఫేవరెటే అంటున్నారు స్వీటీ అభిమానులు..
Tags:    

Similar News