7:11 నుంచి మెలోడీ అదిరింది..!

Update: 2023-05-31 17:33 GMT
సినిమాలో మంచి కంటెంట్ ఉండాలి కానీ, హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు అనేది చూడకుండా ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ముందుంటారు. థియేటర్ లో అయినా, ఓటీటీలో అయినా మంచి సినిమాలను హిట్ చేయడంలో ముందుంటారు. కాగా, అలాంటి సినిమాతోనే ఓ కొత్త టీమ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మూవీ టైటిల్ నుంచి మూవీ మొత్తం కూడా కొత్తగా ఉండేలా చిత్రీకరించాం అని చెబుతోంది 7:11 PM మూవీ టీం. ఈ సినిమాలో సాహస్ హీరోగా పరిచయం అవుతుండగా, దీపిక అనే యువతి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇద్దరూ పేరుకు కొత్తవారు అయినా, మూవీలో చాలా అద్భుతంగా నటించారట. ఈ సినిమా కి చైతు మాదాల దర్శకత్వం వహించారు.  ఆర్కస్ ఫిల్మ్స్ పతాకంపై నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి  ఈ మూవీని నిర్మించారు.

7:11 PM చాలా డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకుంటందట. ఇది టైమ్ ట్రావెల్, ఇంటర్‌స్టెల్లార్ ట్రావెల్‌తో క్రైమ్ డ్రామాతో ముడిపడి ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, ఈ మూవీకి సంబంధించిన ఓ సూపర్ మెలోడీ లిరికల్ వీడియో విడుదల చేశారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి అద్భుతంగా ఆలపించాడు. నీలా నన్నిలా అంటూ సాగే పాట వినగానే నచ్చేలా ఉంది. ఇద్దరు ప్రేమికుల మధ్యా సాగే రొమాంటిక్ సాంగ్ ఇది. పాట చివర్లో లిప్ లాక్స్ కూడా ఉండటం గమనార్హం. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది.

ఈ మూవీ కథ విషయానికి వస్తే 1999లో జరిగినట్లుగా చూపిస్తారు. ప్రజెంట్, ఫ్యూచర్ మధ్య జరిగే టైమ్ ట్రావెల్ కథలా సాగుతుంది. ముఖ్యంగా హంసలదీవి అనే పట్టణం గురించి ఈ మూవీ కథ ఆధారపడి ఉంటుంది. టైమ్ ట్రావెల్ అయినప్పటికీ థ్రిల్లింగ్ గా సాగుతుందని చెబుతున్నారు.ఇప్పటికే విడుదల చేసిన మూవీ టైటిల్,ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రానికి శివ శంకర్, ఫాబియో కాపోడివెంటో సినిమాటోగ్రఫీని నిర్వహించగా, శ్రీను తోట ఎడిటర్ గా వ్యవహరించారు. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసువచ్చే అవకాశం ఉంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.






Full View

Similar News