అమ్మాయిలకు అను సలహా!

Update: 2018-11-13 01:30 GMT
దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా అమ్మాయిలపై లైంగిక వేదింపులు జరుగుతున్న విషయం తెల్సిందే. అఘాయిత్యాలు మరియు అమ్మాయిలపై దాడులను అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవి సఫలం కావడం లేదు. దేశంలో ఏదో ఒక మూలన ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ అఘాయిత్యాలకు కొద్దిలో కొద్దిగా అయినా అమ్మాయిల తప్పు ఉందనేది కొందరి అభిప్రాయం. తాజాగా హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

తాజాగా ఒక కార్యక్రమంలో మాట్లాడిన అనుపమ పరమేశ్వరన్‌ అమ్మాయిల పై జరుగుతున్న అఘాయిత్యాల గురించి మాట్లాడటం జరిగింది. ఈ సందర్బంగా అనుపమ అమ్మాయిలకు కొన్ని సలహాలు ఇచ్చింది. ఆ సలహాలు కాస్త ఇబ్బందే అయినా కూడా వాటిని పాటించడం వల్ల ఖచ్చితంగా అమ్మాయిలు అబ్బాయిల నుండి కాస్త అయినా ఉపశమనం పొందవచ్చు అంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఒక అబ్బాయితో అబ్బాయి చెడుగా ప్రవర్తించినట్లయితే వెంటనే రియాక్ట్‌ అవ్వొదు. ఆ సమయంలో సీరియస్‌ గా రియాక్ట్‌ అవ్వడం వల్ల అవతలి వ్యక్తి మరింత వయోలెంట్‌ గా మారే అవకాశం ఉంది. నేను కాలేజ్‌ వెళ్లే సమయంలో ఒక వ్యక్తి బస్‌ లో నన్ను టచ్‌ చేసేందుకు ప్రయత్నించాడు. అప్పుడు ఆ వ్యక్తిని సున్నితంగా పక్కకు జరగండి అన్నాను. అలా కాకుండా సీరియస్‌ అయ్యి చెంప పగులకొడితే మరింత సీరియస్‌ అయ్యే అవకాశం ఉందని, ఆ తర్వాత ఎప్పుడైనా ఆ వ్యక్తి మీపై దాడికి ప్రయత్నించే అవకాశం ఉంది. అందుకే ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినప్పుడు వెంటనే సీరియస్‌ రియాక్ట్‌ అవ్వొద్దని అనుపమ సలహా ఇచ్చింది. నిజంగానే అమ్మాయిలు ఆ సమయంలో కాస్త శాంతంగా ఉండి - తర్వాత పరిణామాలను ఆలోచిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని నిపుణులు కూడా అంటున్నారు.

Tags:    

Similar News