• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ పిల్ల స్పీడ్‌ మామూలుగా...

ఈ పిల్ల స్పీడ్‌ మామూలుగా లేదే

By - Tupaki Desk
Update: 2015-09-16 09:30 GMT
టాలీవుడ్‌ లోకి అనూహ్యంగా దూసుకొచ్చింది నిత్యామీన‌న్‌. మ‌ల‌యాళం నుంచి వ‌చ్చిన ఈ రింగుల జుత్తు సుంద‌రి జూనియ‌ర్ సౌంద‌ర్య అన్న పేరు తెచ్చుకుంది. సౌంద‌ర్య త‌ర్వాత సౌంద‌ర్య‌గా టాలీవుడ్ స‌ర్కిల్స్‌ లో పాపుల‌ర్ అయ్యింది. నిత్యాకి ఏపీ, తెలంగాణ‌లో వీరాభిమానులున్నారు. ఆ అందానికి, ఆ అభిన‌యానికి ప్లాటైపోని కుర్రాడే లేడంటే అతిశ‌యోక్తి కాదు. అయితే ఇటీవ‌లి కాలంలో ఈ రింగుల జుత్తు సుంద‌రి టాలీవుడ్‌ లో ప‌రిమితంగానే సినిమాలు చేస్తోంది. నితిన్‌ తో సినిమాలు చేసిన త‌ర్వాత వేరే ఏ హీరోతోనూ క‌మిట‌వ్వ‌లేదు.

మ‌ణిర‌త్నం ఓకే బంగారం త‌ర్వాత మ‌ళ్లీ నిత్యా న‌టించిన సినిమా ఏదీ చ‌ర్చ‌ల్లోకి రాలేదు. స‌రిగ్గా ఇలాంటి టైమ్‌ లో ఎంట్రీ ఇచ్చింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. ఈ భామ నిత్యాకి వార‌సురాలు అనే చెప్పాలి. చూడ‌టానికి సేమ్ లుక్స్‌ - చ‌బ్బీ రూపం - రింగుల జుత్తు ఆక‌ట్టుకుంటోంది. అందుకే మ‌న ఫిలింమేకర్స్ ఈ అమ్మ‌డికి ప‌డిపోయారు. ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్‌ - దిల్‌ రాజు - చందు మొండేటి వంటి ద‌ర్శ‌కులు ఈ అమ్మ‌డికి ఛాన్సిచ్చి ఎంక‌రేజ్ చేస్తున్నారు. మాస్ మ‌హారాజ్ ర‌వితేజ హీరోగా దిల్‌ రాజు నిర్మిస్తున్న సినిమాలో ఈ అమ్మ‌డు ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తోంది. అయితే ఇందులో క‌థానాయిక‌గా మాత్రం అనుప‌మ క‌నిపించ‌ద‌ని చెబుతున్నారు.

అలాగే నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ప్రేమ‌మ్ రీమేక్‌ లో న‌టిస్తోంది. చందు మొండేటి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇక నితిన్ స‌ర‌స‌న త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ గ్రాండ్ ఆఫ‌ర్ కొట్టేసింది. ఇలా నిత్యా లానే జెట్ స్పీడ్‌ తో దూసుకుపోతోంది. ఒకే ఒక్క ప్రేమం హిట్ (మ‌ల‌యాళంలో) ఇన్ని అవ‌కాశాలిచ్చింది. తెలుగు ప్రేక్ష‌కుల చేత అభిన‌వ సౌంద‌ర్య అనిపించుకుంటుందేమో చూడాలి మ‌రి.
Tags:    
  • Anupama Parameswaran 
  • Tollywood Movies 

Similar News

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

Copyright @2026

Powered by Blink CMS