• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #మీటూ:పాయింట్‌ జిప్‌ తీసి...

#మీటూ:పాయింట్‌ జిప్‌ తీసి అసభ్యంగా...

By - Tupaki Desk
Update: 2018-10-21 06:12 GMT
ఇన్నాళ్లు పెద్ద మనుషులుగా చెలామణి అయిన బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఇప్పుడు పరువు పోగొట్టుకుని నేల చూపులు చూస్తున్నారు. మీటూ ఉద్యమంలో భాగంగా ఎంతో మంది మహిళలు మరియు సెలబ్రెటీలు తాము ఎదుర్కొన్న లైంగిక వేదింపులను మీడియా ముందుకు వచ్చి చెబుతున్న నేపథ్యంలో స్టార్స్‌ గా పేరు దక్కించుకున్న వారు ఇప్పుడు చుక్కలు చూస్తున్నారు. ఏం చేయాలో పాలుపోక కొందరు ఇంట్లోంచి బయటకు వెళ్లడం లేదు, మరి కొందరు మాత్రం తమపై బురద జల్లుతున్నారంటూ తిరిగి ఆరోపిస్తున్నారు. ఈ సమయంలోనే బాలీవుడ్‌ ప్రముఖ సంగీత దర్శకుడు అను మాలిక్‌ పై లైంగిక వేదింపుల ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

ఇప్పటికే అను మాలిక్‌ పై సింగర్స్‌ సోనా మహాపాత్ర - శ్వేత పండిత్‌ లు లైంగిక వేదింపుల ఆరోపణలు చేశారు. ఆయన తమ పట్ల చాలా దారుణంగా వ్యవహరించాడు అంటూ వారిద్దరు స్వయంగా మీడియా ముందు చెప్పారు. దాంతో ఆయనతో వర్క్‌ చేసేందుకు ప్రస్తుతం బాలీవుడ్‌ వర్గాల వారు ఆసక్తి చూపడం లేదు. ఇదే సమయంలో మరింత ఘాటుగా ఈసారి ఒక మహిళ అను మాలిక్‌ పై ఆరోపణలు చేయడంతో మరింతగా ఆయన్ను చిత్కరిస్తున్నారు.

తన పేరు బయట పెట్టేందుకు ఇష్టపడని ఒక మహిళ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. 1990 వ సంవత్సరంలో తాను మెహబూబా స్టూడియోలో అను మాలిక్‌ ను కలిశాను. ఆ సమయంలో నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నేను అతడిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో సారీ చెప్పాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు నన్ను ఇంటికి రమ్మన్నాడు. అక్కడికి వెళ్లిన తర్వాత నాకు అర్థం అయ్యింది ఏంటీ అంటే అక్కడ ఎవరు లేరు - నన్ను లైంగికంగా వేదించాలని ఆయన భావిస్తున్నాడని అనిపించింది. అతడు నా వద్దకు వచ్చి అతడి జిప్‌ తీయడంతో పాటు - నా స్కర్ట్‌ ను పైకి ఎత్తే ప్రయత్నం చేశాడు. నన్ను బలవంతం చేయబోతున్న సమయంలో అదృష్టం బాగుండి కాలింగ్‌ బెల్‌ మోగింది. దాంతో నేను బయట పడ్డాను. ఈ విషయం ఎవరితో అయినా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడని ఆమె చెప్పుకొచ్చింది.

Tags:    
  • Anu Malik 
  • Sexual harassment 
  • Anonymous woman 

Similar News

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

Copyright @2026

Powered by Blink CMS