యావరేజ్ భామలనే తీసుకుంటున్నాడా?

Update: 2016-08-25 07:30 GMT
వరుస హిట్స్ తో జోరు చూపిస్తున్న త్వరలో మజ్ను అంటూ వచ్చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా.. ఆగస్ట్ 26న ఆడియో విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పుడు ఓ పాటను ఎఫ్ ఎం రేడియోలో రిలీజ్ చేసిన నాని అండ్ టీమ్ పై కొన్ని కామెట్స్ వినిపిస్తున్నాయి. 'కళ్లు మూశాక' అనే పాటను రిలీజ్ చేయగా.. ఈ కార్యక్రమానికి నానితో పాటు హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కూడా హాజరైంది.

స్వతహాగా అందగాడు ట్యాలెంటెడ్ అయిన నానికి హీరోయిన్ అంటే.. చాలానే ఊహించేసుకుంటారు ఆడియన్స్. కానీ అను మాత్రం తన లుక్స్ తో నిరుత్సాహపరిచిందని అంటున్నారు. మలయాళీ సినిమాల్లో మంచి పేరే ఉన్నా.. ఇక్కడ అంతగా ఆకట్టుకోలేకపోయిందనే టాక్ వినపిస్తోంది. మరోవైవు ఇదే సినిమాలో ప్రియా లుధాని అనే మరో మోడల్‌ కూడా నటిస్తోంది. ఈమె కూడా పెద్ద అందగత్తేమీ కాదనే టాక్ ఇప్పటికే ఉంది. మరి నాని ఇలా పెద్దగా మెప్పించలేని హీరోయిన్స్ ను తీసుకోవడంపై ఓ టాక్ బయల్దేరింది.

హీరోయిన్ మహా అందగత్తె అయితే.. జనాలంతా ఆమెను చూడ్డానికే సరిపోతుందని.. మరి అలాంటప్పుడు పెర్ఫామెన్స్ పై దృష్టి పెట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయని.. అందుకే నాని ఇలా యావరేజ్ అమ్మాయిలనే సెలక్ట్ చేసుకుంటున్నాడనే వాదన మొదలైంది. ఏది ఏమైనా కూడా.. సినిమా రిలీజైతే తప్పించి ఈ హీరోయిన్ల గురించి ఒక క్లారిటీకి రాలేం మనం.

Tags:    

Similar News