సలార్' లో మరో సూపర్‌ స్టార్‌

Update: 2020-12-14 06:15 GMT
ప్రభాస్‌.. ప్రశాంత్ నీల్‌ ల కాంబో మూవీ 'సలార్‌' పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ను రూపొందించి బిగ్గెస్ట్‌ పాన్‌ ఇండియా మూవీగా సలార్‌ ను నిలపాలంటూ ప్రశాంత్‌ నీల్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకోసం నటీనటుల ఎంపిక నుండి టెక్నీషియన్స్‌ వరకు అందరి విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న కేజీఎఫ్‌ 2 ఒక వైపు షూటింగ్‌ జరుపుకుంటూ ఉండగా మరో వైపు సలార్‌ మూవీ కోసం ఆడిషన్స్‌ నిర్వహించడంతో పాటు ఇతర నటీనటుల ఎంపిక కూడా చేస్తున్నాడు.

సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈసినిమాను మరింత మంది ప్రేక్షకులకు చేరువ అయ్యేలా మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్ ను నటింపజేయాలని నిర్ణయించుకున్నాడు. జనతా గ్యారేజ్‌ సినిమాలో ఎన్టీఆర్‌ తో కలిసి నటించిన మోహన్‌ లాల్‌ సౌత్‌ ఇండియాతో పాటు నార్త్‌ ఇండియా మొత్తం కూడా సుపరిచితుడు. అందుకే సలార్‌ లో ఆయన నటించడం వల్ల ఖచ్చితంగా సినిమా వెయిట్‌ పెరుగుతుందని కథ కూడా మరింత ఇంపాక్ట్‌ గా చెప్పే అవకాశం ఉంటుందని ప్రశాంత్‌ నీల్‌ భావిస్తున్నాడట. ఈ విషయంలో ప్రశాంత్‌ నీల్‌ తీసుకుంటున్న నిర్ణయాలు సినిమాపై మరింతగా అంచనాలు పెంచేవిగా ఉన్నాయంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Tags:    

Similar News