'దొరసాని' హీరోయిన్ కి మరో ఛాన్స్

Update: 2021-02-13 00:30 GMT
రాజశేఖర్ కూతురు శివాత్మిక కథానాయికగా కొంతకాలం క్రితం 'దొరసాని' అనే సినిమా వచ్చింది. ఈ సినిమాతోనే ఈ అమ్మాయి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. చినదొరసాని పాత్రలో ఆమె చాలా సహజంగా నటించింది. తొలి సినిమానే అయినా ఎంతో అనుభవం ఉన్నట్టుగా నటించి మెప్పించింది. ఆ తరువాత ఈ అమ్మాయి ఫలానా హీరోతో ఫలానా సినిమా చేస్తోందంటూ వార్తలు వచ్చాయిగానీ, అధికారిక ప్రకటనలు మాత్రం రాలేదు. 'దొరసాని' తరువాత ఈ అమ్మాయి ఇక్కడ మరో సినిమా చేయలేదు.

తెలుగులో సరైన కథ పడలేదో .. సరైన అవకాశం మళ్లీ రాలేదో తెలియదుగానీ, ఈ అమ్మాయి ఒక తమిళ సినిమా మాత్రం ఒప్పుకుంది. 'అభినందన' హీరో కార్తీక్ తనయుడు గౌతమ్ ఈ సినిమాలో హీరోగా చేయనున్నాడు. నందా పెరియస్వామి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో ఈ కథ నడవనుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

గౌతమ్ కార్తీక్ 'కడల్' సినిమా ద్వారా మణిరత్నం దర్శకత్వంలో తమిళ తెరకి పరిచయమయ్యాడు. అయితే ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో కార్తీక్ అభిమానులు డీలాపడ్డారు. కానీ ఈ కుర్రాడు పట్టుదలతోనే రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. తమిళంలో యువ హీరోలకు గట్టిపోటీ ఇస్తూ వెళుతున్నాడు. ఈ మధ్య మరీ దూకుడు పెంచేసి వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అలా ఆయన ఓకే చేసిన ప్రాజెక్టులోకి శివాత్మికను తీసుకున్నారు. ఈ సినిమా తమిళంలో ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.




Tags:    

Similar News