• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సన్నబడిన జర్నీ పాప

సన్నబడిన జర్నీ పాప

By - Tupaki Desk
Update: 2018-02-14 06:15 GMT
అచ్చ తెలుగు అమ్మాయే అయినా టాలీవుడ్ లో కంటే కోలీవుడ్ లోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న అంజలి ఈ మధ్య బొత్తిగా కనిపించడం మానేసింది. పోయిన డిసెంబర్ లో బెలూన్ అనే సినిమా ఒకటి రావాల్సింది కాని నిర్మాతకు ఉన్న ఏదో సమస్య వల్ల అది తమిళ్ లో మాత్రమే విడుదలైంది. జర్నీతో మనవాళ్ళను బాగా ఆకట్టుకున్న అంజలి ఆ తర్వాత వెంకటేష్ - బాలకృష్ణ - రవితేజ లాంటి స్టార్ హీరోలతో చేసింది కాని టైం తో పాటు అవకాశాలు కూడా కలిసి రాలేదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఏది చేతిలో లేదు కాని తమిళ్ లో మాత్రం ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో బాగానే మేనేజ్ చేస్తోంది.

ఫిజిక్ పరంగా  కాస్తంత బొద్దుగా కనిపించే అంజలి ఇప్పుడు దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. సీనియర్ హీరోలతో తప్ప యూత్ సరసన చూస్తే కాస్త వయసు ఎక్కువ అనిపించే అంజలి ప్రత్యేక శ్రద్ధతో శరీరాన్ని తీర్చిదిద్దుకునే పనిలో పడింది. దానికి సాక్ష్యమే పైన మీరు చూస్తున్న ఫోటోలు. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టు అంజలి ఈ రూపంలో ఇంకా క్యుట్ గా కనిపిస్తోంది. నల్లని డ్రెస్ లో కరెంటు తీగలా మారిపోయిన అంజలిని చూసి ఫాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ మధ్యే తన సత్తా మళ్ళి చూపిస్తాను అని చెప్పిన అంజలి దానికి తగ్గట్టే వర్క్ అవుట్ మొదలు పెట్టింది.

అంజలి ప్రస్తుతం కాళి - కన్బదు పోయ్ - నాదోడిగల్ 2 సినిమాల్లో నటిస్తోంది. పెరంబు అనే మలయాళం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. హీరో జైతో పీకల్లోతు ప్రేమలో ఉందనే వార్తలు గట్టిగానే షికారు చేసాయి కాని ప్రస్తుతం ఆ టాపిక్ గురించి ఇద్దరూ బయట మాట్లాడ్డం లేదు. అడిగితే కెరీర్ ఫస్ట్ అంటున్న అంజలి జైతో ప్రేమ పెళ్లి దాకా వెళ్తుందా అనే ప్రశ్నకు మాత్రం జవాబు చెప్పడం లేదు.
Tags:    
  • Anjali 
  • Actress Anjali 
  • TElugu News 

Similar News

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

Copyright @2026

Powered by Blink CMS