హిట్ డైరెక్టర్ కి హీరోలు దొరకట్లేదా

Update: 2016-10-25 09:30 GMT
సాధారణంగా ఓ హిట్ కొడితేనే.. డైరెక్టర్ కి డిమాండ్ వచ్చేస్తుంది. కాకపోతే ద్వితీయ విఘ్నం సెంటిమెంట్ ఒకటి వెంటాడుతూ ఉందనే ఉద్దేశ్యంతో.. రెండో సినిమా రిజల్ట్ వరకూ ఆగుతూ ఉంటారు నిర్మాతలు. రెండో మూవీని కూడా హిట్ చేయగల డైరెక్టర్లు కొందరే ఉంటారు. అది కూడా మంచి హిట్ సాధిస్తే మాత్రం ఇక ఆ దర్శకుడికి క్రేజ్ మామూలుగా ఉండదు.

పటాస్.. సుప్రీమ్ లతో హిట్లు కొట్టిన అనిల్ రావిపూడి పరిస్థితి మాత్రం విచిత్రంగా ఉందనే టాక్ ఉందంటున్నారు. సుప్రీమ్ తో మెగా హిట్ కొట్టేశాక.. వరుసగా ఆఫర్స్ వచ్చేస్తాయ్.. సినిమాలు చేసేస్తాడని అనుకుంటే.. ఇంకా ఒకటి కూడా పట్టాలెక్కలేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా చేద్దామని భావించినా.. జూనియర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఆతర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ ని ఒప్పించాడు కానీ.. తర్వాత ఈ ప్రాజెక్టు కూడా హోల్డ్ లోకి వెళ్లిపోయింది. హీరోగా గుడ్డివాడు పాత్ర చేయాల్సి ఉండడంతో.. ఈ ప్రాజెక్టును ఏ హీరో చేస్తాడనే ఆసక్తి ఎక్కువవుతోంది.

దిల్ రాజు బ్యానర్ లో నిర్మితమయ్యే సినిమాకి కూడా.. ఇంకా హీరో దొరక్కపోవడం ఆశ్చర్యం. ఇప్పటికైతే ఈ సబ్జెక్టుతో దర్శక నిర్మాతలిద్దరూ హీరోలను సంప్రదిస్తున్నారని.. ఒక స్టార్ హీరో-ఒక మీడియం హీరో రిజెక్ట్ చేసిన సబ్జెక్ట్ కావడంతో సై అనేందుకు చాలామంది సందేహిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి పటాస్ డైరెక్టర్.. చివరకు ఎవరితో ఈ సినిమా చేస్తాడో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News