ఇలా అయితే ఎలా శ్యామల?

Update: 2016-11-08 22:30 GMT
సినిమాల్లో యాక్ట్ చేసే వాళ్లు మాత్రమే స్కిన్ షో చేస్తారు.. టీవీల్లో కనిపించే యాంకరమ్మలు పద్దతిగా ఉంటారనే భావనలు ఎప్పుడో పోయాయ్. గ్లామర్ అంటే ఇప్పుడు ఎక్కడైనా గ్లామరే. అది సినీ ఫీల్డైనా.. టీవీ మీడియా అయినా ఒకటే. ఇక జనరేషన్ తో పాటే యాంకర్స్ డ్రెస్సింగ్ స్టైల్లోనూ ఛేంజ్ వచ్చేసింది. సీనియర్స్ అలాగే ఉన్నా.. జూనియర్స్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. వాక్చాతుర్యం కన్నా అందాల ఆరబోతతో టీవీక్షకుల్ని ఎట్రాక్ట్ చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రొగ్రామ్ ఏదైనా సరే అటెన్షన్ తమ మీద పడటానికి స్కిన్ షో కూడా చేసేస్తున్నారు.

సీనియర్స్ లో సుమ.. ఝాన్సీ ట్రెడిషనల్ గా కనిపిస్తే ఆల్ రౌండర్ సునీత తన అందంతోనే ఆడియెన్స్ ని కట్టిపడేసేది. ఉదయభాను.. శిల్పా చక్రవర్తి లాంటి వాళ్లు గ్లామర్ క్వీన్స్ గా మెరిసేవాళ్లు. ఇక అనసూయ ఎంట్రీ తర్వాత టీవీ యాంకర్స్ గ్లామర్ స్టాండర్డ్స్ మారిపోయాయ్. అనసూయ ఎప్పుడైతే జబర్ధస్త్ గా అందాలు ఆరబోయడం మొదలుపెట్టిందో మిగిలిన వాళ్లు కూడా అదే రూట్ లో బ్లైండ్ గా వెళ్లిపోతున్నారు. అవసరమున్నా లేకపోయినా రష్మీ.. శ్రీముఖి లాంటి వాళ్లంతా స్కిన్ షోతోనే టీవీ ఫీల్డ్ లో నెట్టుకొచ్చేస్తున్నారు.
Read more!

అయితే వీళ్లందరి మధ్య కాస్త పద్దతిగా కనిపిస్తూ ఆకట్టుకొంటున్న యాంకర్ ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పుడు శ్యామల పేరు వినిపిస్తోంది. సీరియల్స్.. అప్పుడప్పుడూ సినిమాల్లో తళుక్కుమనే శ్యామల యాంకర్ గా కూడా బాగా పాపులర్. ఎన్ని టీవీ షోస్.. ఇంకెన్ని ప్రొగ్రామ్స్ చేసినా ట్రెడిషనల్ గానే దర్శనమివ్వడం శ్యామల స్పెషాల్టీ. పోటీ పెరిగిపోతుంది.. ఇలా అయితే కష్టం డ్రెస్సింగ్ విషయంలో కాస్త లిబరల్ గా ఉండూ అని సలహాలు ఇచ్చినా శ్యామల మాత్రం డోంట్ కేర్ అనేస్తుందట. అవకాశాలు రాకపోయినా పర్వాలేదు కానీ పద్దతులు మాత్రం మార్చే ప్రసక్తి లేదని నిర్మోహమాటంగా చెప్పేస్తుందట. మోడ్రన్ గా కనిపించాలని ఎవరైనా ఒత్తిడి చేస్తే ఆఫర్స్ ని కూడా కాదనేస్తుందట. ఒకవేళ అదే నిజమైతే కెరీర్ కన్నా ట్రెడిషనల్ లుక్ కే ప్రాధాన్యత ఇస్తోన్న శ్యామలని నిజంగా ఒప్పుకోవాల్సిందే. అలాగే పెట్టుకొన్న రూల్స్ ని బ్రేక్ చేయకుండా ఎన్నాళ్లూ నెట్టుకొస్తుందో కూడా చూడాలి.
Tags:    

Similar News