• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మురుగ‌దాస్‌ నే డైరెక్ట్...

మురుగ‌దాస్‌ నే డైరెక్ట్ చేసే ఛాన్స్‌!

By - Tupaki Desk
Update: 2018-09-12 04:21 GMT
గురువుల‌కే గురువు మురుగ‌దాస్ కెప్టెన్ సీటుకే అంకితం అవ్వ‌కుండా ఓ సినిమాలో న‌టిస్తున్నారంటే .. అదేంటో తెలుసుకోవాల‌న్న‌ ఆస‌క్తి అభిమానుల్లో ఉంటుంది. అది కూడా ఓ త‌మిళ్‌- తెలుగు ద‌ర్శ‌కుడు తీసే ద్విభాషా చిత్రంలో మురుగ‌దాస్ న‌టించ‌డం ఆస‌క్తి క‌లిగించ‌కుండా ఉండ‌దు. ఇంత‌కీ ఏ సినిమా?

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న `నోటా` చిత్రంలో మురుగదాస్ ఓ ఆస‌క్తిక‌ర పాత్ర‌లో న‌టిస్తున్నారు. నోటా పొలిటిక‌ల్ బ్యాక్‌ డ్రాప్ సినిమా. ఇటీవ‌లే రిలీజైన ట్రైల‌ర్ కోటి వ్యూస్ దిశ‌గా దూసుకుపోతోంది. ఈ చిత్రంలో డైరెక్ట‌ర్ ఆనంద్ శంక‌ర్ ఏరికోరి త‌న గురువు మురుగ‌దాస్‌ చే ఓ రోల్ చేయిస్తున్నారు. అక్టోబ‌ర్‌ లో రిలీజ్‌ కి రెడీ అవుతున్న ఈ సినిమాకి సంబంధించి బ్యాలెన్స్ సీన్స్‌ ని ఆనంద్ తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం మురుగ‌దాస్‌ పై కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నార‌ట‌. ఈ సంద‌ర్భంగా ఆనంద్ శంక‌ర్ స్వ‌యంగా ట్విట్ట‌ర్‌ లో మురుగ‌దాస్ ఆన్ లొకేష‌న్ ఉన్న‌ప్ప‌టి ఫోటోని షేర్ చేసి త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

``ఎంతటి ఆహ్లాద‌క‌ర‌మైన సంద‌ర్భ‌మిది!  నా డైరెక్ట‌ర్‌నే నేను డైరెక్ట్ చేస్తున్నా.. ఆయ‌న న‌టుడిగా.. నోటా సినిమా కోసం`` అంటూ ట్వీట్ చేశారు. ఇది యువ‌ద‌ర్శ‌కుడు ఆనంద్‌ కి అరుదైన ఛాన్స్. ఈ సంద‌ర్భంగా మురుగ‌దాస్ నుంచి టిప్స్ ఏవైనా తీసుకునే అవ‌కాశం దొరికిందేమో! ఆనంద్ శంక‌ర్ ప్ర‌ఖ్యాత ప్లే రైట‌ర్ - జాతీయ అవార్డు గ్ర‌హీత‌ కోమ‌ల్ స్వామినాథ‌న్ కుమారుడు. మెకానిక‌ల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ద‌ర్శ‌క‌త్వం వైపు అడుగులు వేశారు. అంజానా అంజానీ (2010) సినిమాకి ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసి - అటుపై తుపాకి (తుప్పాక్కి-త‌మిళ్‌) - సెవెంత్ సెన్స్ ( 7ఏఎం ఆరివు) చిత్రాల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ కం ప్రొడ్యూస‌ర్‌ గా ఆనంద్ శంక‌ర్ ప‌ని చేశారు. ఇప్పుడు ఏకంగా గురువు మురుగ‌దాస్‌ నే ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఛాన్స్ అందుకున్నారు.


Tags:    
  • Anand Shankar 
  • Murugadoss 
  • NOTA Movie 

Similar News

అహంకారమనే ముద్రకు ధనుష్ వినూత్న కౌంటర్!

2026-11-15 09:46 GMT

అర్థరాత్రి పూట భార్య‌కి వార్నింగ్ లు!

2026-11-15 09:45 GMT

రామాయ‌ణ‌: 10రోజుల్లో 1200 కోట్లు.. 2000 కోట్ల క్ల‌బ్ ఇంకెంత దూరం?

2026-11-15 09:42 GMT

పని పోతుందనే భయంతో వేధింపులు సైతం భరించాను!

2026-11-15 09:38 GMT

25 ఏళ్లయినా ఇంకా జీవితాన్ని అర్ధం చేసుకుంటూనే ఉన్నా!

2026-11-15 07:32 GMT

త్రివిక్రమ్ గారు మీరు అలాంటి సినిమాలే తీయండి సార్...

2026-11-15 07:32 GMT

లగ్జరీ కంటే ప్రశాంతతే ముఖ్యం..ఎందుకో చెప్పిన సీత‌మ్మ‌

2026-11-15 06:52 GMT

బాలయ్యకు డిసెంబర్ సెంటిమెంట్.. ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే..

2026-11-15 06:31 GMT

మెగా హీరో సినిమాలో ఛాన్స్.. బండి సరోజ్ ఎందుకు వద్దన్నారంటే!

2026-11-15 06:19 GMT

నిర్మాత కష్టాలతోనే సినిమా.. పేర్లు కూడా బయటపెడతానంటూ..

2026-11-15 05:28 GMT

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

2026-11-15 03:34 GMT

జూనియ‌ర్ అతిలోక సుంద‌రి అలా ఫెయిలైంది!

2026-11-15 02:30 GMT

Copyright @2026

Powered by Blink CMS