నెగటివ్‌ వార్తలపై బచ్చన్‌ సీరియస్‌

Update: 2020-07-24 14:00 GMT
నెగటివ్‌ వార్తలపై బచ్చన్‌ సీరియస్‌
అమితాబచ్చన్‌ మరియు ఆయన తనయుడు అభిషేక్‌ బచ్చన్‌ కోడలు ఐశ్వర్య రాయ్‌ మనవరాలు ఆరాధ్యలు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడంతో ప్రస్తుతం అంతా కూడా నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. ఈ విషయమై బచ్చన్‌ ఫ్యామిలీ సన్నిహితులు మరియు అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బచ్చన్‌ ఫ్యామిలీ కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యి రెండు వారాలకు పైగా అయ్యింది. ఈ సమయంలో ఒక జాతీయ న్యూస్‌ ఛానెల్‌ అమితాబచ్చన్‌ కు కరోనా నెగటివ్‌ వచ్చిందని.. ఆయన త్వరగా కోలుకున్నాడు అంటూ న్యూస్‌ బులిటెన్‌ ప్రసారం చేయడం జరిగింది.

ఆ వార్తలపై అమితాబచ్చన్‌ సీరియస్‌ అయ్యాడు. ట్విట్టర్‌ లో ఆ న్యూస్‌ ఛానెల్‌ ట్వీట్‌ ను రీ ట్వీట్‌ చేసి ఈ వార్త నిజం కాదు. బాధ్యత లేకుండా అబద్దపు వార్తలను ప్రచారం చేస్తున్నారంటూ ట్వీట్‌ చేశాడు. అమితాబ్‌ ట్వీట్‌ తో ఆయన ఇంకా కరోనాతోనే బాధపడుతున్నట్లుగా క్లారిటీ వచ్చింది. సాదారణంగా అయితే రెండు వారాల్లో కరోనా నుండి బయట పడుతున్నారు. బచ్చన్‌ జీ వయసు కాస్త ఎక్కువ కనుక ఆయన మరికొన్ని రోజుల తర్వాత అయినా ఈ విపత్కర పరిస్థితి నుండి బయట పడతాడని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అభిషేక్‌ బచ్చన్‌ ఐశ్వర్య మరియు ఆరాధ్యల ఆరోగ్యం విషయంలో కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ రావడం లేదు. నానావతి ఆసుపత్రి వర్గాలు మాత్రం ప్రస్తుతానికి అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని.. సాదారణ చికిత్స అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఎవరికి ప్రాణపాయ స్థితి లేదని అంటున్నారు. త్వరలోనే అంతా కూడా పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ అవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు.
Tags:    

Similar News