ఫోటో స్టోరిః సదరన్‌ స్పైస్ అదిరే

Update: 2015-08-27 19:39 GMT
ఫోటో స్టోరిః సదరన్‌ స్పైస్ అదిరే
మళయాళ కుట్టి అమలాపాల్.. అందాలు ఒలకబోస్తోంది కదూ. ఎర్రటి చీర కట్టి బుర్రగా మెరిసిపోతున్న డ్రస్ చూడండి. ఉండీ లేనట్లున్న పైటను... నున్నని నడుముతో సహా మొత్తం కనిపించేలా.. వేసుకున్న స్టైల్ చూస్తే... కుర్రకారుకి కిర్రెక్కిపోవాల్సిందే. కూర్చున్నా, నుంచున్నా ఎలాంటి డ్రస్‌కయినా తాను ఎలా ఒదిగిపోగలదో ఫోటోలతోనే చెప్పేస్తోందీ చిన్నది. కట్టూబొట్టే కాదు. చూపులతోనే మత్తెక్కించడం, నటనతో మైమరిపించేలా చేయగలిగే ట్యాలెంట్ కూడా ఉంది అమలాపాల్‌కి .

హావభావాలతో కట్టిపడేయడం ఈ భామకు కొట్టిన పిండి. నోట్లో వేలు పెట్టుకుని అమాయకంగా మనవైపే చూస్తుంటే.. అయ్యో అనిపిస్తోంది కదూ.. అంత దిగాలుగా ఉన్నావేంటమ్మా అని ఓదార్చాలనిపిస్తోందా ? ఈ చిన్నదానికి అన్నీ ఉన్నా కాస్త లక్ తక్కువంతే. ఛాన్సులు బాగానే వస్తాయి. తెలుగులో బెజవాడ, లవ్ ఫెయిల్యూర్ వంటి ఫ్లాప్‌లున్నా... తర్వాత మెగా క్యాంప్‌లో సందడి చేసింది. చరణ్, బన్నీలతో ఒకే ఏడాది జత కట్టినా... కుర్రదానికి కలిసిరాలేదు. దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ ఇంకా అధృష్టం వరించలేదు. కాసింత టైం కలిసొస్తేనా... తన అంతటోళ్లు లేరని ప్రూవ్ చేసుకునేందుకు ఎప్పుడూ రెడీయే. టాప్ లీగ్ వెళ్లగలిగే హీరోయిన్ గా అన్ని అర్హతలు ఉన్నాయని అర్ధమవుతూనే ఉన్నా... ఎందుకో సదరన్ స్పైస్ ను చిన్నచూపు చూస్తున్నారు డైరెక్టర్లు.
Tags:    

Similar News