తమ్మూ సినిమాలో అమల బ్రదర్

Update: 2016-06-21 13:55 GMT
అమలా పాల్.. ఈ కేరళ సుందరాంగి తెలుగులో చేసిన సినిమాల సంఖ్య చాలా తక్కువ. టాలీవుడ్ లో 5 సినిమాలు మాత్రమే చేసినా.. తమిళ్ - మలయాళ భాషల్లో మాత్రం చాలానే చిత్రాలు చేసింది. రెండేళ్ల క్రితం తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయినా సరే.. మధ్యమధ్యలో సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి మాత్రం దూరం కాలేదు. గతేడాది పసంగ2 చిత్రంలో కేరక్టర్ తో అందరి ప్రశంసలు అందుకుంది.

ఈ హీరోయిన్ కి అభిజిత్ అనే సోదరుడు ఉన్నాడు. ఇతడికి సినిమా ఇండస్ట్రీపై మక్కువ బాగా ఎక్కువ. యాక్టర్ అయిపోవాలనే ఆలోచనతో అక్కపై గట్టిగానే ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఈమె భర్తపై ప్రెజర్ తీసుకొచ్చి యాక్టర్ గా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. మరి అంత అందమైన భార్య చెబితే.. దర్శకుడు అవకాశం ఇవ్వకుండా ఉంటాడా? అలా తమన్నా - ప్రభుదేవా కాంబినేషన్ లో రూపొందుతున్న అభినేత్రి చిత్రంలో అవకాశం ఇచ్చాడని తెలుస్తోంది.

తెలుగు - తమిళ్ - హిందీ భాషల్లో తెరకెక్కుతున్న అభినేత్రి మూవీలో.. ఓ కీలక పాత్ర కోసం అభిజిత్ కు ఛాన్స్ ఇచ్చారట. ఈ రోల్ సినిమాకి కీలకంగా ఉంటుందని.. ఈ చిత్రం తర్వాత ఈ కొత్త నటుడికి మంచి పేరు వస్తుందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి అక్క - బావల సహకారంతో.. ఓ యాక్టర్ ఇండస్ట్రీలోకి వచ్చేస్తున్నాడన్న మాట.
Tags:    

Similar News