• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బన్నీ బట్టలు కాఫీలో...

బన్నీ బట్టలు కాఫీలో నానబెట్టి ఉతుకుతున్నారట...!

By - Tupaki Desk
Update: 2020-05-07 17:30 GMT
బన్నీ - సుకుమార్ క‌ల‌యిక‌లో తెర‌కెక్కు‌తున్న హ్యాట్రిక్ సినిమా 'పుష్ప‌'. 'అల వైకుంఠపురంలో' సినిమా విజయంతో జోష్ మీదున్న అల్లు అర్జున్ వెంటనే ఈ సినిమాని పట్టాలెక్కించేసాడు. చాలా రోజులు క్రితమే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి దాకా జరిగిన షెడ్యూల్స్ లో బన్నీ లేని సీన్స్‌ కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించారు. కానీ కరోనా మహమ్మారి వచ్చి ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ వేసింది. సుక్కు ప్రతి సినిమాలో హీరోని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తూ వస్తున్నాడు. 'పుష్ప' పోస్టర్ చూస్తే లెక్కల మాస్టర్ సుకుమార్ మరో ప్రయోగానికి తెరలేపాడని ఇట్టే అర్ధమైపోతుంది. శేషాచ‌లం అడ‌వుల్లో గంధపు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా బన్నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో ఒక హింట్ ఇచ్చారు. 'పుష్ప'లో అల్లు అర్జున్ ని ఊర మాస్ లుక్ లో చూపించడం కోసం చిత్ర యూనిట్ తెగ కష్టపడుతోంది.

కరోనా కారణంగా అనుకోకుండా దొరికిన ఈ సమయంలో చిత్ర యూనిట్ కథా కథనాలకు మరింతగా మెరుగు పెట్టే పనిలో ఉన్నారు. తాజాగా బన్నీ కాస్ట్యూమ్స్‌కు సంబంధించి కూడా కొన్ని ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్‌ లో కనిపిస్తుండటంతో కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అందులో భాగంగా సినిమాలో బన్నీ వినియోగించబోయే కాస్ట్యూమ్స్‌ను రెండు రోజుల పాటు కాఫీలో నానబెట్టి తరువాత ఉతికి ఆరబెడుతున్నారట. ఓల్డ్‌ లుక్‌ కోసం ఇలా చేస్తున్నారట. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ మరియు ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సుక్కు ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. బన్నీ - సుక్కు కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా వీరిద్దరి గత చిత్రాలు మంచి విజయాలు సొంతం చేసుకోవడంతో 'పుష్ప'పై కూడా నమ్మకంతో ఉన్నారు అభిమానులు.
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • Allu Arjun 
  • Sukumar 
  • Pushpa 
  • Alluarjun costumes are soaking in coffee for old look 

Similar News

ఎన్టీఆర్‌ డ్రాగన్ షూట్‌ ఇంకా ఎంత కాలం..?

2026-11-13 22:30 GMT

'రామాయణ 2' రీ షూట్‌ వార్తల్లో నిజం ఎంత?

2026-11-13 19:30 GMT

వివాహం అనంత‌రం ఇద్ద‌రు ఒకేలా!

2026-11-13 18:30 GMT

మోక్షజ్ఞ మొదటి సినిమాకు ఇన్ని అడ్డంకులు ఏంటో పాపం..!

2026-11-13 17:30 GMT

O.Mగా టైటిల్ మార్పు.. ధ‌నుష్ ఇవ్వ‌బోతున్న స‌ర్‌ప్రైజ్ అదే!

2026-11-13 16:37 GMT

పూర్తి గుండుతో అందాల క‌థానాయిక ప్ర‌యోగం!

2026-11-13 16:37 GMT

హను రాఘవపూడి డైరెక్షన్ లో నాని ఆ సినిమా చేయాల్సిందా?

2026-11-13 16:30 GMT

షాకింగ్‌: 2 కోట్ల బ‌డ్జెట్ సినిమాకి 63 కోట్ల శాటిలైట్ ధ‌ర‌?

2026-11-13 15:30 GMT

ఆ డైరెక్టర్ కి ఒక్క కమర్షియల్ హిట్ ఉంటే సుకుమార్ కి పోటీ ఇచ్చేవాడా?

2026-11-13 14:30 GMT

'OG 2' కంటే ముందే పవన్ సినిమా.. ఆ ప్లాన్ సెట్టయ్యేనా?

2026-11-13 14:00 GMT

భార్యపై పెరిగే ప్రేమకు ట్యూన్ కడితే.. నితిన్ 'పిచ్చి ప్రేమలో'!

2026-11-13 13:51 GMT

'ఫ్యామిలీ స్టార్' దెబ్బ.. విజయ్‌తో దిల్ రాజు ఈసారి మరోలా!

2026-11-13 13:49 GMT

Copyright @2026

Powered by Blink CMS