అల్లు హీరోకి అన్నీ కలిసొస్తున్నాయ్

Update: 2016-07-30 22:30 GMT
రెండు సినిమాలు చేసినా హిట్ అందుకోలేకపోయిన అల్లు శిరీష్.. ఈసారి ప్రయత్నం గట్టిగానే చేస్తున్నాడు. మెగా అనే ట్యాగ్ ఉన్నా.. అభిమానులను ఆకట్టులేకపోయిన ఈ కుర్రాడు.. మరో వారం శ్రీరస్తు శుభమస్తు మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈసారి మాత్రం అల్లు అబ్బాయి హిట్ కొట్టేట్టే ఉన్నాడు. టైమ్ కూడా బాగానే కలిసొస్తోంది.

ఆగస్టు 5న శ్రీరస్తు శుభమస్తుతో పాటు మరో రెండు సినిమాలు రిలీజ్ కి షెడ్యూల్ చేయగా.. వీటిలో నుంచి ఆది చుట్టాలబ్బాయ్ అగస్ట్ 19కి వాయిదా పడిపోయింది. ఇది కాకుండా టైట్ బడ్జెట్ తో తెరెకక్కిన మనమంతా విడుదలవుతోంది. ఈ లెక్కన చూస్తే.. అసలు శ్రీరస్తు శుభమస్తు  చిత్రానికి పోటీ లేనట్టే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సోలో ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన శ్రీరస్తు శుభమస్తు ట్రైలర్ ఇప్పటికే ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది.

మరోవైపు జూలై 31న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేయడం.. దీనికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రానుండడంతో.. మరింతగా హైప్ క్రియేట్ అయ్యే ఛాన్సుంది. అటు ప్రచారం.. ఇటు పోటీ లేకపోవడం చూస్తుంటే.. ఈ సారి అల్లు శిరీష్ హిట్ కొట్టేట్లుగానే ఉన్నాడు.
Tags:    

Similar News