ఫన్నీ మూవ్ మెంట్.. అల్లు మనవరాలు డోంట్ నీడ్ పిల్లో

స్టార్ కిడ్స్ అల్లు అయాన్ .. అర్హ ..లను పరిచయం చేయాలా? అల్లు అర్జున్ - స్నేహ జంట గారాల పట్టీలు. తాత అరవింద్ ని ఆటపట్టించే గడుగ్గాయ్ లు. బన్నీతో అర్హ ఆటల వీడియోలు చూసి ఫ్యాన్స్ మురిసిపోతూ ఉంటారు. ఇక కిడ్స్ కి సంబంధించినంతవరకూ.. ఫ్యామిలీ ఎఫైర్స్ ని ఏదీ దాచుకోకుండా ప్రతి అల్లరి వేషాన్ని బన్ని సోషల్ మీడియాలో రివీల్ చేస్తుంటారు.
తాజాగా ఒక అందమైన ఛాయాచిత్రాన్ని అల్లు అర్జున్ భార్య స్నేహ అభిమానుల కోసం షేర్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. నేటి ఉదయం తన ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులందరికీ తన పిల్లల పడకగది గురించి ఒక ఆసక్తికర సంగతిని స్నేహా వెల్లడించారు. అర్హ తన సోదరుడి వీపును దిండుగా ఉపయోగించడం చూడగానే ఆ ఫన్నీ వేషానికి అభిమానుల ముఖాల్లో చిరునవ్వులు కురిసాయి.
స్నేహ ఈ ఫోటోకి ఫన్నీ శీర్షికను జోడించారు. #dontneedapillow అనే హ్యాష్ ట్యాగ్ ని జోడించారు. బన్నీ - స్నేహ ఇద్దరూ తరచూ వారి పిల్లల సరదా చిత్రాలను పంచుకుంటారు. ఈ ప్రత్యేక చిత్రం ఇన్ స్టా ఆల్బమ్ లో ప్రత్యేక స్థానాన్ని పొందుతుందనడంలో సందేహమేం లేదు. ప్రస్తుతం బన్ని అభిమానుల్లో ఈ ఫోటో వైరల్ గా మారింది. సుక్కూతో పుష్ప చిత్రీకరణలో పాల్గొనేందుకు బన్ని సమాయత్తం అయిన సంగతి విధితమే.