అల్లు అరవింద్ సోదరి ఇక లేరు!!

అలనాటి మేటి హాస్య నటుడు కమ్ సినీ నిర్మాత.. కమ్ మెగాస్టార్ చిరంజీవికి మావయ్య అయిన అల్లు రామలింగయ్య పెద్ద కుమార్తె.. అల్లు భారతి మృతి చెందారు. ఆమె అల్లు అరవింద్ కు.. అలాగే మెగాస్టార్ భార్య సురేఖకు అక్కయ్య అవుతారు. అవివాహిత అయిన భారతి.. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఆమె వయస్సు 74 సంవత్సరాలు. గత సాయంత్రం ఆమె ఆరోగ్యం క్షీణించగా.. ఈరోజు ఉదయం మరణించినట్లు తెలుస్తోంది.
అనుకోకుండా భారతి తనువు చాలించడంతో.. అల్లు ఫ్యామిలీ అంతా శోకసముద్రంలో మునిగిపోయింది. ఇక ఇదే సమయంలో వారు తీసిన ''ధృవ'' సినిమా తాలూకు ప్రమోషన్లు చేయాల్సి ఉండటంతో.. రామ్ చరణ్ వాటన్నింటినీ రద్దు చేసి.. తన పెద్దమ్మ అంతిమ సంస్కారాలకు సంబంధించి ఏర్పాట్లు చూస్తున్నారు. అల్లు భారతి ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్ధిస్తూ.. అల్లు అండ్ మెగా ఫ్యామిలీలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/