• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బన్నీ కూడా లీవ్...

బన్నీ కూడా లీవ్ తీసుకున్నాడు

By - Tupaki Desk
Update: 2017-12-30 12:30 GMT
టాలీవుడ్ లో ప్రస్తుతం చాలా మంది హీరోలు షూటింగ్ లకు సెలవులు పెట్టేస్తున్నారు. సినిమా షూటింగ్ కి ఏ మాత్రం ఇబ్బంది కలగకూడదని ఒక వారం ముందే నిర్మాతలకు ఇంటిమేషన్ ఇస్తున్నారట. అందుకు కారణం ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. న్యూ ఇయర్ వస్తుండడంతో 2018 మొదటి రోజు క్షణాన్ని ఆనందంతో కేరింతలతో మొదలు పెట్టాలని ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకుంటున్నారు.

అయితే కొందరు విదేశాలకు వెళుతుంటే.. మరికొందరు ఇంట్లోనే కుటుంబ సభ్యులతో ఘనంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇంకా కొంత మంది  ఫ్రెండ్స్ తో స్పెషల్ ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా నాలుగు రోజులు సెలవు పెట్టి ఇండోనేషియాకు ప్లాన్ వేసుకున్నాడు. అక్కడ బాలి లో తన చిన్న ఫ్యామిలీతో న్యూ ఇయర్ ని సింపుల్ గా సెలబ్రేట్ చేసుకొని అనుకున్న టైమ్ కి ఇండియాకి వచ్చేస్తాడట.

ప్రస్తుతం అల్లు అర్జున్ నా పేరు సూర్య అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆర్మీ ఆఫీసర్ గా అందులో బన్నీ కనిపించబోతున్నాడు. రచయిత వక్కంత వంశీ ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు సినిమా షూటింగ్ పూర్తికావచ్చింది. మరికొన్ని రోజుల్లో ఫైనల్ షెడ్యూల్ ని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టనున్నారట. ఫైనల్ గా సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహకాలు చేస్తున్నారు.   
Tags:    
  • Allu Arjun 
  • NEw Year Celebrations 

Similar News

దీపావళి వేళ స్పెషల్ ఫొటోషూట్.. విమర్శలు ఎదుర్కొంటున్న రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-09 08:37 GMT

ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆదరిస్తారా? స్టార్ హీరోల సినిమాల మధ్య చిన్న మూవీకి సవాలే!

2026-11-09 08:33 GMT

కుర్రకారుకు కొత్త క్రష్.. ఆకట్టుకునే అందంతో!

2026-11-09 08:17 GMT

డిజాస్టర్ టాక్ తో 100 రోజులు ఆడిన సినిమా.. ఇదేమి ట్విస్ట్ రా బాబు!

2026-11-09 08:17 GMT

చిన్నప్పుడు అలా ఉండి ఉంటే బాగుండేది.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

2026-11-09 07:57 GMT

శతదినోత్సవాలలో ఆ హీరో లెక్క వేరు ... ఏ స్టార్‌కు సాధ్యం కాని రికార్డు ఇదే!

2026-11-09 07:56 GMT

హీరోయిన్లకే ఎందుకింత ఒత్తిడి.. జాన్వి, రాధిక తర్వాత తన బాధను బయటపెట్టిన కీర్తి సురేష్!

2026-11-09 07:56 GMT

ఊపేయ‌డానికి రెడీ అయిన క్లాస్ భామ‌లు!

2026-11-09 07:56 GMT

లిటిల్ హార్ట్స్ ఫస్ట్ ఛాయిస్ నేనే.. కానీ.. ఆ అదృష్టం ఇప్పుడు దొరికింది!

2026-11-09 07:55 GMT

సరైన దారి తెలియకపోయినా.. విజయ్ బాటలో మాత్రం నడవని సూర్య!

2026-11-09 06:59 GMT

మ‌ళ్లీ హ్యాట్రిక్ కొట్టిన సూర్య‌!

2026-11-09 06:41 GMT

రివ‌ర్స్ గేమ్ మొద‌లు పెట్టిన స‌తీమ‌ణి!

2026-11-09 06:21 GMT

Copyright @2026

Powered by Blink CMS