బన్నీ ఛాన్స్ ఇస్తున్నాడంటలే

Update: 2016-09-28 16:56 GMT
కొత్త డైరక్టర్లతో పనిచేయడానికి మన స్టార్ హీరోలు రెడీగా ఉంటారా లేదా? ఆ విషయం చెప్పలేం కాని.. ఎప్పుడో కెరియర్ తొలినాళ్ళలో సుకుమార్ అనే కొత్త దర్శకుడితో కలసి 'ఆర్య' సినిమాలో పనిచేసిన అల్లు అర్జున్ ఆ తరువాత ఒక్క కొత్త డైరక్టర్ తో కూడా పనిచేయలేదు. అందుకే ఇప్పుడు ఈ నూతన డైరక్టర్ కు ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తాడని అంటున్నారు.

ఇప్పటికే ఎన్టీఆర్ తన కథను ఓకె చేయకపోవడంతో వెంటనే బన్నీ దగ్గరకు వెళ్ళాడు రైటర్ వక్కంతం వంశీ. కాకపోతే అక్కడ కూడా పనిజరగలేదు అందుకే బన్నీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ దువ్వాడ జగన్నాథమ్ తరువాత లింగుస్వామితో సినిమాను చేస్తున్నాడు అని రూమర్లు వచ్చేశాయి. కాని ఇదే విషయాన్ని వంశీ సన్నిహితుల దగ్గర ప్రస్తావిస్తే.. బన్నీ ఇతగాడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తోంది. జనవరి నుండి ఇటు లింగస్వామి అటు వక్కంతం సినిమాలను ఒకేసారి మొదలెట్టే ఛాన్సుందని టాక్.

అంటే మొత్తానికి బన్నీ ఒక కొత్త డైరక్టర్ తో ఇన్నేళ్ల తరువాత పనిచేస్తున్నాడనమాట. అయితే వక్కంతం వంశీని దాదాపు స్టార్ హీరోలందరూ ఇలాగే ఊరించి లాస్టులో హ్యాండిస్తున్నారు. మరి బన్నీ అయినా హ్యాండివ్వకుండా ఉంటే బాగుండు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News