బ‌న్నీని లాక్ డౌన్ చేసే వ్యూహ‌మా ఇది?

Update: 2020-04-10 04:15 GMT
ఇండ‌స్ట్రీ లో చిత్ర‌విచిత్రాలు ఎన్నో. హీరో.. నిర్మాత‌ల మ‌ధ్య బాండింగ్ పూర్తిగా క‌మ‌ర్షియ‌ల్ కోణంలోనే ఉంటుంది. తాను ఒక సినిమా చేసేందుకు అంగీక‌రిస్తే అందుకు పారితోషికం ఇవ్వ‌డం.. లాభాల్లో వాటాలివ్వ‌డం.. ఆ హీరో పేరుతో భారీగా బిజినెస్ చేసుకుని లాభ‌ప‌డ‌డం .. ఇలా సాగుతుంది రిలేష‌న్ షిప్. ఇక అగ్ర నిర్మాత‌ల మ‌ధ్య మంచి స్నేహానుబంధం ఉన్నా.. బిజినెస్ లావాదేవీల ప‌రంగా బోలెడంత రిలేష‌న్ షిప్ మెయింటెయిన్ చేయాల్సి ఉన్నా.. అవ‌న్నీ క‌మ‌ర్షియ‌ల్ కోణంలోనే సాగుతుంటాయ‌న్న గుస‌గుస‌లు వినిపిస్తుంటాయి. అయితే ఈ త‌ర‌హా రిలేష‌న్ షిప్ అయినా ద‌శాబ్ధాల పాటు కొన‌సాగించ‌గ‌లుగుతున్నారంటే వారి మ‌ధ్య కాస్త ఎథిక‌ల్ బాండింగ్ ఉంద‌నే దాన‌ర్థం. ఎంతో కాలంగా తెలిసిన హీరోతో నిర్మాతలు ఎంతో స‌న్నిహితంగా మెల‌గ‌డం ఆప్యాయంగా ప్రేమ‌గా ఉండ‌డం.. విలువ‌ల‌తో కూడుకున్న రిలేష‌న్ షిప్ ని సాగించడం అనే యాంగిల్ ని కూడా విస్మ‌రించ‌కూడ‌దు.

అలాంటి రిలేష‌న్ షిప్స్ మెయింటెయిన్ చేస్తారు కాబ‌ట్టే స‌ద‌రు హీరో నుంచి ప‌దే ప‌దే అవ‌కాశాలు ద‌క్కేందుకు ఛాన్సుంటుంది. ఈ విష‌యంలో అగ్ర నిర్మాత కం పంపిణీదారుడు దిల్ రాజు ఎంతో జాగ్ర‌త్త‌గానే ఉంటారు. ఇక అల్లు అర‌వింద్ - బ‌న్నీ ఫ్యామిలీస్ తో దిల్ రాజు బాండింగ్ ప్ర‌త్యేక‌మైన‌ది. ఏదేమైనా ఓ వైపు బ‌న్ని ఓ పెద్ద ఫ్లాప్ అందుకుని ఎంతో డైల‌మాలో ఉన్న స‌మ‌యంలో తెలివిగా దిల్ రాజు `ఐకాన్` అంటూ వేణు శ్రీ‌రామ్ క‌థ‌తో లాక్ చేసేశాడు. అప్ప‌ట్లోనే పోస్ట‌ర్ ని కూడా వేసేశారు.

ఇక సెట్స్ కెళ్లిపోవ‌డమే అనుకుంటుండ‌గా ఊహించ‌ని మ‌లుపులు దిల్ రాజును చికాకు పెట్టేశాయి. అనూహ్యంగా ఐకాన్ వెన‌క్కి వెళ్లిపోయింది. రేస్ లోకి త్రివిక్ర‌మ్ .. సుకుమార్ దూసుకు రావ‌డంతో వేణు శ్రీ‌రామ్ క‌మిట్ మెంట్ వీగిపోయింది. అప్ప‌టికి ఆ ప్రాజెక్టును బ‌న్నీ హోల్డ్ లో పెట్టేశాడు. త్రివిక్ర‌మ్ పుణ్యామా అని అల వైకుంఠ‌పుర‌ములో బ్లాక్ బ‌స్ట‌ర్ విజయం సాధించ‌డంతో బ‌న్నిలో హుషారు పెరిగింది. ఈ హుషారులోనే సుకుమార్ తో సినిమాని ప‌ట్టాలెక్కించేస్తున్నాడు. అయితే ఈలోగానే క‌రోనా పెద్ద పంచ్ వేసింది. ఇక మ‌రో సినిమాని ప్రారంభించాలంటే ఏడాది పాటు ఆగాల్సిన స‌న్నివేశం క‌నిపిస్తోంది. అయితే ఇంత గ్యాప్ ఉంది కాబ‌ట్టి.. ఐకాన్ సినిమాని బ‌న్ని మ‌ర్చిపోకుండా గుర్తు చేసేందుకు మొన్న బ‌ర్త్ డే సంద‌ర్భంగా పోస్ట‌ర్ వేశార‌న్న‌ చ‌ర్చ వేడెక్కించింది. ఇప్ప‌టికే మ‌ర్చిపోయిన ప్రాజెక్టును గుర్తు చేసేందుకే ఈ జిమ్మిక్కా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. దీనిపై చివ‌రికి బ‌న్ని కూడా ఆరా తీసాడ‌న్న గుస‌గుస‌నే కాస్త తేడాగా వినిపిస్తోంది మ‌రి. ఇంత‌కీ ఐకాన్ ఉన్న‌ట్టా లేనట్టా?
Tags:    

Similar News